Chiranjeevi: చరణ్, రానా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టిన చిరంజీవి!

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత సినిమాతో సినీ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రముఖ హీరో రానా, రామ్ చరణ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే.

అయితే వీళ్లిద్దరూ కలిసి చిన్నప్పుడూ చాలా అల్లరి చేసేవారట. ఈ విషయాన్ని చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సాధారణంగా సెలబ్రిటీల పిల్లలంటే చాలా జల్సాగా ఉంటారని అంతా అనుకుంటారు. వీళ్ళు మాత్రం రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకొని కాసేపు చదువుకున్నట్టు యాక్టింగ్ చేసి ఆ తర్వాత కిటికీల కు ఉండే గ్రిల్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లి బయట చాలా సేపు తిరిగి మళ్లీ ఏమీ తెలియనట్లు ఇంట్లో కి వచ్చి గ్రిల్స్ మళ్లీ పెట్టేసి ఎప్పటి లాగే చదువుకుంటూ యాక్టింగ్ చేసేవారుట.

ఈ విషయాన్ని (Chiranjeevi)  చిరంజీవి ఓ షో లో పాల్గొన్నప్పుడు బయటపెట్టారు. దీంతో ఈ విషయం వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మెగా హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ తర్వాత చెర్రీ ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబుతో అర్ సి 16లో నటించనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో హీరో స్పోర్ట్స్ మ్యాన్.

చిన్న గ్రామం నుంచి మొదలైన అతని ప్రస్థానం అంతర్జాతీయంగా తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ, విలన్ అడ్డుపడటంతో హీరో ఆటల్లో పాల్గొన్నప్పుడు ఓ అవయవాన్ని కోల్పోతాడు. అయినప్పటికీ హీరో కృంగిపోకుండా.. తన ఆశయాన్ని సాధించడానికి ఒక కొత్త జట్టును ఏర్పాటు చేసి.. వారు అంతర్జాతీయ స్థాయిలో కప్‌ ఎలా సాధించారు అనేదే కథ. కాగా సినిమా మధ్యలో రామ్ చరణ్ హ్యాండీక్యాప్డ్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus