Narappa Movie: నారప్పలో వెంకీ కనిపించలేదు: చిరంజీవి

అసురన్ సినిమాకు రీమేక్ గా వచ్చిన నారప్ప ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. థియేట్రికల్ గా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోకుండా మంచి ఆఫర్ కు లొంగిపోయి ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. నారప్ప క్యారెక్టర్ కు వెంకటేష్ తనదైన శైలిలో న్యాయం చేసి ఓ వర్గం వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి నారప్పను చూసి చిత్ర యూనిట్ కు తన బెస్ట్ విషెస్ అంధించాడు.

అందరికి కంగ్రాట్స్ అంటూ నారప్ప పర్ఫామెన్స్. ఎంతో కొత్తగా ఉంది. ఆ పాత్ర చూస్తున్నంత సేపు తనకు వెంకటేష్ కనిపించలేదని నారప్ప మాత్రమే కనిపించాడని అన్నారు. పాత్రను అర్థం చేసుకొని ఎంతో డెప్త్ గా నటించావని పొగిడారు. నీలో ఉండే యాక్టర్ నిత్యం ఒక తపనతో కనిపిస్తాడని.. అందుకు ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు నీకు ఈ సినిమా మంచి సంతృప్తిని ఇవ్వడమే కాకుండా జీవితాంతం గర్వపడే సినిమాగా నిలిచిపోతుందని తనదైన శైలిలో శుభాకాంక్షలు అంధించారు.

మెగాస్టార్ మాటలకు వెంకటేష్ కూడా స్పంధించాడు. ప్రతి మాట ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఈ ప్రోత్సాహం కూడా చాలా గర్వంగా ఉందని చెప్పాడు. అంతే కాకుండా థ్యాంక్యూ చిరంజీవి.. అని వెంకటేష్ స్పెషల్ గా మెన్షన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus