మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని చిరంజీవి భావించారు. అయితే 2009 ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాలలో మాత్రమే ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించడం గమనార్హం. ఆ తర్వాత చిరంజీవి వేర్వేరు కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నారు.
2019 ఎన్నికల సమయంలో కూడా చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. అయితే చిరంజీవి ట్విట్టర్ లో తన వాయిస్ ఉన్న ఆడియోను పోస్ట్ చేయగా ఆ ఆడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో చిరంజీవి “నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు” అని చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ ట్వీట్ చేయగా ఈ ట్వీట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ గా లేకపోయినా రాజకీయాలకు సంబంధం ఉన్న సినిమాల్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మరోవైపు ఈరోజు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెరగనుందని సమాచారం అందుతోంది. చిరంజీవి ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ల ఫలితాలను బట్టి కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో చిరంజీవి నిర్ణయాలు తీసుకోనున్నారు. చిరంజివి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ లకు చిరంజీవి ఓకే చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమాసినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది. ఒక్కో సినిమాకు చిరంజీవి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే చిరంజీవి రెమ్యునరేషన్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు.