Chiranjeevi: నేవీ డే స్పెషల్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిరు.. ట్వీట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ప్రతి ఒక్క అకేషన్ కు సంబంధించి విషయాలను జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే నేవీ డే సందర్భంగా గతంలో తాను నేవీ క్యాడేట్లో పని చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అప్పటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా గోవాలో జరిగిన 53వ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాలలో భాగంగా గోవా వెళ్లినటువంటి మెగాస్టార్ అక్కడ నౌకాదళ ఆఫీసర్లతో కలిసి దిగినటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో పాటు తాను యువకుడిగా ఉన్న సమయంలో నేవీ దుస్తులతో ఉన్నటువంటి ఫోటోని కూడా షేర్ చేశారు.

గోవా వెళ్ళినప్పుడు కొందరు నౌకదల ఆఫీసర్స్ తన వద్దకు వచ్చి ఫోటో దిగారు అప్పుడు నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. తాను కూడా ఎన్ఎస్ సీ లో జాయిన్ అయినప్పుడు నేవీ క్యాడెట్ లో సేవలు అందించాను. హ్యాపీ నేవీ డే అంటూ సోషల్ మీడియా వేదికగా ఈయన నేవీ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా చిరంజీవిని నేవీ డ్రెస్ లో చూసినటువంటి అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మీరు ఎన్ సీసీలో కూడా పని చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ఈయన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus