మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. గాడ్ ఫాదర్ తొలిరోజు కలెక్షన్లు చిరంజీవి గత సినిమాల కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాకు జరిగిన బిజినెస్ తో పోల్చి చూస్తే ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హర్యానా గవర్నర్, బీజేపీ సీనియర్ నేతలలో ఒకరైన బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ కు రావాలని కొంతకాలం నుంచి కోరుకుంటున్నానని అల్లు అరవింద్ కు, పవన్ కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది కానీ నాకు దత్తాత్రేయ గారి నుంచి ఆహ్వానం అందలేదని అన్నారు.
ఆయన దృష్టి పడిన తర్వాత ఈ ప్రోగ్రామ్ కు వద్దామని నేను అనుకున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. గాడ్ ఫాదర్ సినిమాతో సక్సెస్ దక్కిన రోజే ఈ ప్రోగ్రామ్ కు నాకు ఆహ్వానం దక్కడం సంతోషంగా అనిపించిందని చిరంజీవి కామెంట్లు చేశారు. ఫ్యాన్స్ మధ్య విద్వేషాలు రగలకుండా కట్టడి చేయడానికి నేను ప్రయత్నించానని చిరంజీవి తెలిపారు. హీరోల మధ్య విభేదాలు ఉండకూడదని నా సినిమాలు సక్సెస్ అయిన సమయంలో అందరినీ పిలిచి విందు ఇచ్చేవాడినని చిరంజీవి చెప్పుకొచ్చారు.
నేను పాలిటిక్స్ లోకి వెళ్లిన సమయంలో రకరకాల ఆరోపణలు చేశారని బ్లడ్ అమ్ముకుంటున్నానని తనపై ఆరోపణలు చేసినా నేను ఏనాడు స్పందించలేదని చిరంజీవి వెల్లడించారు. మాటకు లొంగని వాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి కామెంట్లు చేశారు. అలయ్ బలయ్ కార్యక్రమ సారాన్ని ఆచరించాలని నేను ఎప్పటినుంచో ఆచరిస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!