Chiranjeevi: సురేఖతో పెళ్లిపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షకులకు దగ్గరైన హీరోగా మెగాస్టార్ చిరంజీవికి పేరుంది. చిరంజీవి భార్య సురేఖ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే తన పెళ్లికి ముందుకు జరిగిన ఘటనలకు సంబంధించి చిరంజీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలలో చిరంజీవి ఈ కామెంట్లు చేశారు. మనవూరి పాండవులు సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో అల్లు రామలింగయ్యను ఆట పట్టించే సీన్స్ తో షూట్ మొదలైందని చిరంజీవి తెలిపారు.

అల్లు రామలింగయ్య నన్ను గమనించేవారని అయితే ఎందుకు గమనించేవారో అర్థమయ్యేది కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు. మద్రాస్ కు ట్రైన్ లో వెళుతున్న సమయంలో అల్లు రామలింగయ్య, మరి కొందరు నన్ను ఓ పెగ్ వేయమని అడగగా నాకు అలవాటు లేదని చెప్పానని చిరంజీవి కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఒక సందర్భంలో గీత అనే అమ్మాయితో అందరూ మాట్లాడుతుండగా నేను హార్స్ రైడింగ్ చేస్తున్నానని చిరంజీవి తెలిపారు. నా ప్రవర్తన నచ్చడంతో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, జయకృష్ణ కలిసి కుట్ర చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

నిర్మాత జయకృష్ణ మా నాన్నను కలిసి సురేఖ గురించి చెప్పి ఒప్పించారని చిరంజీవి కామెంట్లు చేశారు. సురేఖతో పెళ్లికి నో చెప్పాలని అనుకున్నానని ఆమె ఇచ్చిన టీ తాగిన తర్వాత నా అభిప్రాయం మారిందని ఆయన కామెంట్లు చేశారు. పెళ్లైన తర్వాత నా మొహం మాడిపోయిందని సురేఖతో రిగ్రెట్స్ లేవని ఆయన కామెంట్లు చేశారు.

చిరంజీవి తన స్టైల్ లో ఈ విషయాలను చెబుతుంటే అందరూ నవ్వుతూ ఉన్నారు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. గాడ్ ఫాదర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. తొలిరోజు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus