Chiranjeevi, Ram Charan: సినిమాలలో నష్టాలు వస్తే చరణ్ చిరుని తిడతారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.చిరంజీవి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈయన వారసుడిగా రాంచరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రామ్ చరణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రామ్ చరణ్ తన కుటుంబ సభ్యులకు ఎంతో విలువ ఇస్తారనే విషయం మనందరికీ తెలిసిందే.

తన తల్లిదండ్రుల నుంచి మొదలుకొని తన బాబాయ్ లు అలాగే చెల్లెళ్లతో సహా అందరి పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఇలా కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా ఉండే రామ్ చరణ్ గురించి గతంలో చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా రామ్ చరణ్ తనని తిడతారు అంటూ తన కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు అంటూ చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి (Chiranjeevi) సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాను నటించిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150 ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా మారారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వినాయక్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మీరు అంటే చరణ్ బాబు చాలా ప్రేమ చూపిస్తారు. మీకు జ్వరం వచ్చిన ఆయన తట్టుకోలేరు ఆయనకు మీరు అంటే ప్రాణం అని చెప్పగా చిరంజీవి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసారు.

నాకు జ్వరం వస్తే చరణ్ బాధ నా గురించి కాదు వాడి సినిమాకి డబ్బులు ఎక్కడ నష్టపోతారని బాధపడతారు అంటూ కామెంట్స్ చేశారు. నావల్ల సినిమాకు నష్టాలు వస్తే తను నాతో గొడవ పడతారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి రామ్ చరణ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఇవన్నీ కూడా సీరియస్ గా చెప్పలేదని చాలా సరదాగా నవ్వుకుంటూ చెప్పారని తెలుస్తోంది. చరణ్ కి మాత్రం తన తండ్రి అంటే అమితమైన ప్రేమ, గౌరవం అనే సంగతి మనకు తెలిసిందే.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus