గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో చిరంజీవి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు చేరాయి. భోళా శంకర్ మూవీతో మరో సక్సెస్ సాధించి చిరంజీవి హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మితకు క్యాస్టూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అయితే పెద్ద కూతురు కోసం చిరంజీవి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తన తర్వాత సినిమాకు సుస్మిత నిర్మాతగా వ్యవహరించాలని చిరంజీవి భావిస్తున్నారని బోగట్టా. సుస్మిత ఇప్పటికే పలు చిన్న ప్రాజెక్ట్ లను నిర్మించినా ఆ ప్రాజెక్ట్ లకు సరైన రెస్పాన్స్ రాలేదు. బీవీఎస్ రవి చెప్పిన లైన్ చిరంజీవికి ఎంతగానో నచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉంది. డైరెక్టర్ ఫైనల్ అయితే కూతురు నిర్మాతగా చిరంజీవి ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయి. చిరంజీవి సుస్మితను స్టార్ ప్రొడ్యూసర్ గా నిలబెట్టాలని భావిస్తున్నారు.
సుస్మిత విషయంలో చిరంజీవి కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది. చిరంజీవి పారితోషికం ప్రస్తుతం 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. తన కూతురు నిర్మాతగా తెరకెక్కే సినిమాకు పారితోషికంకు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి త్వరలో వరుస ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.
మిడిల్ రేంజ్ డైరెక్టర్లకు చిరంజీవి ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.