మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో మంచి పనులు చేశారు.’చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ ను స్థాపించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు. కోవిడ్ సెకండ్ వేవ్ టైములో ఈయన చేసిన గొప్ప పనుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! బండ్ల గణేష్ వంటి వారి ప్రాణాలు నిలబడడానికి కూడా ఆయన కారణమయ్యారు చిరు. ఈ విషయాన్ని బండ్ల గణేషే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ పెద్దగానే కాకుండా మంచి మనసున్న మనిషిగా కూడా ఆయన చాటిచెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇన్ని మంచి పనులు చేసినా.. ఆ వార్తల్ని ఎక్కడో చివరి పేజీలో వేయడం పైగా కొందరు ఈయన్ని విమర్శల పాలు చేయడం వంటివి కూడా అనేకం ఉన్నాయి. ఎటువంటి విపత్తు వచ్చినా ముందుగా ఉండేది చిరునే..! సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. చిరు తన తోబుట్టువులకు కూడా అండదండగా నిలబడతారు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్లకి ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా.. ఆ భారాన్ని దించేందుకు ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు.
అదే కోవలో చిరు తన చెల్లెళ్ళకు కూడా కోట్ల విలువచేసే బహుమతులు ఇచ్చారట. వివరాల్లోకి వెళితే.. చిరుకి హైదరాబాద్లోని కోకాపేట్ లో రెండెకరాల స్థలం ఉంది.దానిని ఆయన చెల్లెళ్లకు బహుమతిగా ఇచ్చేసారట. చిరంజీవి భార్య సురేఖ సలహా మేరకు ఇలా చేసినట్టు… చిరు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ స్థలం కోట్ల రూపాయల విలువైనది.దానిని తన చెల్లెళ్ళ పేరు పై రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు.సురేఖ గారి గొప్పతనం చెబుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు.