Ram Charan: రామ్‌ చరణ్‌ చెప్పాడు నాలుగు అని.. ఏంటా చిరంజీవి సినిమాలు!

సెకండ్‌ను ఇన్నింగ్స్‌ను ‘ఖైదీ నెం 150’తో స్టార్ట్‌ చేసిన చిరంజీవి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తారేమో అనుకుంటే.. చాలా స్లోగా సాగారు. ‘సైరా’ లాంటి ప్రతిష్ఠాత్మక, కలల ప్రాజెక్ట్‌ భుజానకెత్తుకున్నాడు. దీంతో ఇలా లేట్‌గా సినిమాలు చేస్తాడేమో అనుకుంటే.. వరుసగా నాలుగు సినిమాలు ఓకే చేసి వావ్‌ అనిపించాడు. అయితే అవన్నీ వచ్చాక ఇప్పుడు చేతిలో ఒక సినిమానే ఉంది. అదే ‘భోళా శంకర్‌’. అయితే ఇప్పుడు చిరంజీవి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని రామ్‌చరణ్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. దీంతో ఏంటా నాలుగు సినిమాలు అనే చర్చ మొదలైంది.

చిరంజీవి (Ram Charan) ప్రస్తుతం మెహర్‌ రమేశ్ డైరక్షన్‌లో ‘భోళా శంకర్‌’ అనే సినిమా చేస్తున్నారు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ సిస్టర్‌ రోల్‌ చేస్తోంది. ఇందులో సుశాంత్‌ మరో ముఖ్య పాత్రధారి. ఈ సినిమా తప్ప ఇంకేవీ అధికారికంగా అనౌన్స్‌ కాలేదు. అయితే చర్చల్లో మాత్రం సినిమా కథలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని ఫైనల్‌ అయిపోయాయని కానీ అనౌన్స్‌ చేయలేదని అంటున్నారు. వీటితోపాటు వెంకీ కుడుమల – డీవీవీ దానయ్య సినిమా కూడా ఉంది. ఇప్పటికే అనౌన్స్‌ అయిన సినిమా హోల్డ్‌లో పెట్టారు.

మా నాన్న నాలుగు సినిమాలకు సైన్‌ చేశారు. అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకరు. ఆయన ఇప్పటికీ తనకు స్ఫూర్తి అంటూ చిరంజీవి గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన వయసు 68 అని, ఇప్పటికీ 5.30 గంటలకు నిద్ర లేస్తారని, హార్డ్ వర్క్ చేస్తారని చరణ్‌ తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో చరణ్‌ చెప్పిన నాలుగు సినిమాలకు దర్శకులు ఎవరు అనేది చర్చగా మారింది.

టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే.. కల్యాణ్‌ కృష్ణతో ఓ సినిమాకు ప్లాన్‌ రెడీ అంట. మలయాళ హిట్‌ సినిమా ‘బ్రో డాడి’కి ఈ సినిమా రీమేక్‌ అంటున్నారు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల జంటగా కనిపిస్తారట. ఈ సినిమా హక్కుల్ని చరణ్‌ చాలా రోజుల క్రితమే కొనుగోలు చేశారు. దీంతోపాటు ‘బింబిసార’ సినిమా ఫేమ్‌ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ సినిమాను ప్లాన్‌ చేశారు. ఈ స్క్రిప్ట్ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందట. త్వరలో అనౌన్స్‌ చేస్తారు అంటున్నారు.

ఈ రెండు సినిమాలు దాదాపు ఫిక్స్‌. ఇక మిగిలింది రెండు సినిమాలు. అవేంటి, వాటికి దర్శకులు ఎవరు అనేదే ఇక్కడ ప్రశ్న. అందులో ఒకరు పూరి జగన్నాథ్‌ కాగా, మరొకరు వి.వి.వినాయక్‌ అంటున్నారు. ఇద్దరూ సిద్ధంగా ఉన్నా కథలు సిద్ధంగా లేకపోవడమే కారణం అంటున్నారు. మంచి కథ సిద్ధమైతే ఈ సినిమాలు కూడా అనౌన్స్‌ అయిపోతాయట. ఒకవేళ ఇవి కాకపోతే ఇప్పటికే చిరంజీవికి కథలు చెప్పిన వక్కంతం వంశీ, డైమండ్‌ రత్నబాబు ముందుకు వస్తారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus