చిరు మాటల్లో అంత అర్ధం ఉందా??

  • March 22, 2016 / 05:57 AM IST

మెగా అభిమానుల మధ్య..మెగా బ్రదర్స్ ఇద్దరు సమక్షంలో జరిగిన సర్దార్ ఆడియో వేడుక మెగా ఫ్యానిలీ అభిమానులకు ఒక పండుగ. అయితే ఆ పండుగలో మెగాస్టార్ మాట్లాడిన ప్రతీ మాట ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎంతో కాలం తరువాత మళ్ళీ అటు పవన్, ఇటు చిరు కలసి ఒకే స్టేజ్ పై కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు.

ఇదిలా ఉంటే మెగా స్టార్ మాట్లాడిన మాటలకు రకరకాల అర్ధాలు తీస్తున్నారు సగటు సినీ విశ్లేషకులు. ఈ వేడుకలో పవన్ ను ఉద్దేశించి చిరు చాలా మాటలే చెప్పాడు…తమ మధ్య అనుబంధం గురించి చెబుతూనే, తమ్ముడు తీసుకున్న నిర్ణయానికి నో చెప్పాడు, ఇంతకీ ఏంటి ఆ నిర్ణయం అంటే, పవన్ సినిమాలు వదిలేస్తాను అని అనడమే. దానిపై చిరు మాట్లాడుతూ…నువ్వు రెండు గుర్రాల మీద స్వారీ చేయగల సత్తా ఉన్నవాడివి. సినిమాలు మానేస్తానని అనద్దు. అది కరెక్ట్ కాదు. నువ్వు రెండింటినీ నడిపించగల స్టామినా ఉన్నవాడివి. ఇంతమంది అభిమానుల కోసమైనా సినిమాలు చేయాలి. నువ్వు ఎంచుకున్న దారిలో నువ్వు వెళ్లినా సినిమాలు చేయి. మేమంతా నీ వెనక ఉన్నాం’ అన్నారు చిరంజీవి.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఆ చివర్లో నీ వెనుక మేమున్నాం అన్న పదమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది…..దాని అర్ధం పవన్ కు సపోర్ట్ గా నా లేకపోతే పవన్ క్రియాశీలక రాజకీయాల్లో తన పార్టీని బలోపితం చేయనున్నాడు కాబట్టి పవన్ పార్టీలో చేరేందుకు చిరు ఏమైనా ఆలోచనలు చేస్తున్నాడా? అని రకరకాల విశ్లేషణలు హాట్..హాట్ గా జరిగిపోతున్నాయి. ఒకవేళ నిజంగా చిరు పవన్ బాటలో జెనసేన వేదికగా ప్రజల్లోకి వస్తే ఈ ఇద్దరు హీరోల ప్రభంజనం తట్టుకోవడానికి ఇతర పార్టీలు ఎంతవరకూ నిలబడతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus