మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన కూతురు సుస్మిత కొణిదెల (Sushmitha) బ్యానర్ అయిన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ లో ఓ సినిమా చేయాలి అనుకున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna) ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపికయ్యాడు. బెజవాడ ప్రసన్న కుమార్ (Prasanna Kumar Bezawada) స్క్రిప్ట్ అందించారు. ‘బ్రో డాడీ’ స్ఫూర్తితో ఈ స్క్రిప్ట్ ను రెడీ చేశారు ప్రసన్న. తండ్రీ కొడుకుల నడుమ సాగే మంచి హిలేరియస్ డ్రామా ఇది. సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ఈ సినిమాలో చిరుకి కొడుకుగా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
కానీ సిద్ధూ జొన్నలగడ్డ డేట్స్ ఖాళీ లేకపోవడం… మధ్యలో చిరు ‘భోళా శంకర్’ (Bhola Shankar) కూడా ప్లాప్ అవ్వడంతో ప్లానింగ్ అంతా మారిపోయింది. అందులో భాగంగా ఈ సినిమా కూడా ఆగిపోయింది. అయితే సిద్ధూ జొన్నలగడ్డ నో చెప్పిన తర్వాత.. ఈ ప్రాజెక్టులో తేజ సజ్జ (Teja Sajja) ని కూడా అనుకున్నారట. సందీప్ కిషన్ ఈ విషయాన్ని ‘రాయన్’ (Raayan) సినిమా ప్రమోషన్స్ లో బయటపెట్టాడు. అంటే చిరు తండ్రి పాత్రలో తేజ సజ్జ కొడుకు పాత్రలో చేయాలన్న మాట.
1998 లో వచ్చిన ‘చూడాలని వుంది’ (Choodalani Vundi) లో వీరు తండ్రీకొడుకులుగా కనిపించారు. అయితే తేజ ఇప్పుడు పెద్దవ్వడమే కాకుండా హీరో కూడా అయ్యాడు. అందువల్ల ఈ కాంబో స్పెషల్ గా ఉండేది. కానీ ఏం చేస్తాం.. సినిమా ఆగిపోయింది. తర్వాత ఇంకా కొన్ని మార్పులు చేసి… త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) – రావు రమేష్ (Rao Ramesh) – సందీప్ కిషన్ (Sundeep Kishan) కాంబినేషన్లో రూపొందిస్తున్నాడు నిర్మాత రాజేష్ దండా. 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.