Chiranjeevi, Aamir Khan: ఎలాంటి సినిమా కావాలో చెప్పేసిన నాగార్జున!

చిరంజీవి – ఆమిర్‌ ఖాన్‌ను ఒక ఫ్రేమ్‌లో చూడటానికే రెండు కళ్లు చాలావు. అలాంటి ఆమిర్‌ సినిమాను చిరంజీవి సమర్పిచడం, దాని కోసం ఇద్దరూ కలసి ప్రచారం చేయడం ఇటీవల మనం చూశాం. దీంతో అభిమాను ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఒకరు మెగాస్టర్‌, రెండో వ్యక్తి మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. అలాంటి ఈ ఇద్దరూ కలసి ఓ సినిమానే చేస్తే.. అదిరిపోతుంది కదా. ఈ కోరిక చాలామందికి ఉండే ఉంటుంది. అలాంటి వారందరికి ఓ గుడ్‌ న్యూస్‌. చిరంజీవి, ఆమిర్ మధ్య ఈ విషయమ్మీద చర్చ జరిగింది.

ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా, కరీనా కపూర్‌ కథానాయికగా, నాగచైతన్య ముఖ్య పాత్రధారిగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఈ సినిమాను చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం చేపట్టిన చిరంజీవి.. ఇప్పుడు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి, ఆమిర్ ఖాన్‌, నాగచైతన్యను నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. కొన్ని రోజుల క్రితం షూట్‌ చేసిన ఈ ఇంటర్వ్యూను త్వరలో స్టార్‌ మాలో టెలీకాస్ట్‌ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను స్టార్‌ మా విడుదల చేసింది.

అందులోనే చిరంజీవి – ఆమిర్‌ ఖాన్‌ సినిమా గురించి చర్చ వచ్చింది. ఆమిర్ ఖాన్ సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేస్తారు అని చిరంజీవిని నాగార్జున అడిగితే.. ‘ఏ సినిమా కూడా చేయను’ అని చిరంజీవి చెప్పాడు. మరోవైపు చిరంజీవితో సినిమా చేయాలని ఉందని ఆమిర్‌ ఖాన్‌ అన్నాడు. చిరంజీవి సినిమాకు డైరెక్షన్ కానీ, ప్రొడక్షన్‌ కానీ చేస్తానని ఆమిర్‌ అన్నాడు. దానికి చిరంజీవి సరదాగా ‘‘టేక్ వన్ ఓకే కాదు కదా’’ అని అన్నారు. చిరంజీవి లాంటి హీరోకు డ్యాన్స్‌, ఫైట్స్‌ ఫుల్‌గా ఉన్న సినిమా కావాలి అని నాగ్‌ అన్నారు.

దీంతో ‘‘ప్రొడక్షన్ ఓకే. డైరెక్షన్ ఒప్పుకోవద్దు అండీ’’ అని చిరంజీవికి నాగార్జున సలహా ఇచ్చాడు. ఆమిర్‌ను టేక్‌ వన్‌ ఆర్టిస్ట్‌ అని అందరూ అంటుంటారు. డైరక్షన్‌లోనూ ఆయన అలాంటిదే ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు కదా. అందుకే చిరంజీవి అలా అన్నారన్నమాట.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus