Chiranjeevi: చిరు బాబీ మూవీలో సెకండ్ హీరోయిన్ ఈమేనా?

చిరంజీవి బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వరుసగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి బాబీ ప్రతిభను నమ్మి అతనికి అవకాశం ఇచ్చారు. ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సమ్మోహనం బ్యూటీ అదితిరావ్ హైదరీ ఫైనల్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా పేరు వినిపిస్తోంది.

అదితిరావు హైదరీ ప్రస్తుతం మహాసముద్రం సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలో అదితి ఎంట్రీ గురించి క్లారిటీ రానుంది. ఈ మెగా ఆఫర్ అదితి కెరీర్ కు ఏ విధంగా ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనుంది. చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

అదితిరావు హైదరీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే అదితిరావు కెరీర్ కు ప్లస్ కావడంతో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే అదితిరావు హైదరీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాబీ గత సినిమా వెంకీమామ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని బాబీ భావిస్తున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus