Chiranjeevi: చిరుతో భేటీ గురించి వైరల్ అవుతున్న గారెత్ విన్ ఓవెన్ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి ‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు ’ అంటూ ఎప్పుడైతే వాయిస్ క్లిప్ షేర్ చేశారో.. అప్పటినుండే ఆయన తిరిగి పాలిటిక్స్‌లోకి వస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.. తర్వాత రోజే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ చిరంజీవి పేరుతో ఐడీ కార్డు రిలీజ్ చేసింది.

కొవ్వూరు నుంచి పీసీసీ డెలిగేట్‌గా చిరంజీవి పేరుని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. 2027 అక్టోబర్ వరకు ఐదేళ్ల పాటు వర్తించేలా ఐడీ కార్డ్ జారీ చేసింది.. ఇదిలా ఉంటే రీసెంట్‌గా చిరుని బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ కలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెగాస్టార్‌తో బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ భేటీ అవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. ఈ మేరకు గారెత్ విన్ ఓవెన్ ట్వీట్ చేశారు.. చిరుతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి యూకే ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించడం గురించి చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన.. చిరంజీవి చేస్తున్న పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని అభినందించారు.. బ్లడ్, ఐ బ్యాంక్, ఆపదలో ఉన్న సినీ కళాకారులను, సాంకేతిక నిపుణులకు చేయూత నివ్వడం.. పాండమిక్ టైంలో పలువురిని ఆదుకోవడం.. ఇలా చిరు చేసిన సేవలను గారెత్ విన్ ఓవెన్ కొనియాడారు..

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఇప్పటికే ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.. 2023 సంక్రాంతికి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్‌కి సాలిడ్ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.. బాబీ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం పెద్ద పండక్కి వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.. రవితేజ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus