Chiranjeevi: నెల్సన్‌ దిలీప్‌తో ఇండస్ట్రీ రికార్డు ప్లాన్‌ చేస్తున్న చిరు… అంతా ఓకే అయితే!

  • September 21, 2023 / 04:22 PM IST

కోలీవుడ్‌ యువ డైరక్టర్లు ఇద్దరూ ఒకేసారి బ్లాక్‌బస్టర్‌లు సాధించారు. దీంతో ఆ ఇద్దరి తర్వాతి సినిమాలు ఏంటి అనే చర్చ మొదలైంది. ఆ దర్శకులు ఇప్పుడు సీనియర్‌ స్టార్‌ హీరోలతో విజయం అందుకున్నవారు కావడం గమనార్హం. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది మేం చెబుతున్నది అట్లీ, నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ గురించే అని. ‘జైలర్‌’ సినిమాతో నెల్సన్‌ దిలీప్‌ విజయం సాధించగా… ‘జవాన్‌’ సినిమాతో అట్లీ విజయం అందుకున్నారు. దీంతో నెల్సన్‌ దిలీప్‌ నెక్స్ట్ సినిమా ఏంటి అనే చర్చ మొదలైంది.

రజనీకాంత్ టైమ్ అయిపోయింది అంటూ గత కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి. వరుస సినిమాలు చేస్తున్నా సరైన విజయం లేదు. అయితే 72 ఏళ్లు వచ్చినా రజనీ క్రేజ్‌కు, మార్కెట్‌కు తిరుగులేదని ‘జైలర్’ సినిమా నిరూపించింది. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో సీనియర్ హీరోలకు నెల్సన్‌ సరైన కాంబో అనే టాక్‌ వచ్చేసింది. ఈ క్రమంలో చిరంజీవి పేరు చర్చలోకి వచ్చింది. నిర్మాత కూడా దాదాపు ఓకే అయ్యారు అని అంటున్నారు.

నెల్సన్ దిలీప్‌ కుమార్‌ తొలి చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా చూసి ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత కేఎస్ రామారావు అడ్వాన్స్‌ ఇచ్చేశారు అని అంటున్నారు. అయితే ఆ తర్వాత నెల్సన్‌ దిలీప్‌ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. అన్ని సినిమాలూ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు నాటి మాటను పట్టుకుని కేఎస్‌ రామారావు సినిమా చేద్దాం అనుకుంటున్నారట. ఇప్పటికే కేఎస్‌ రామారావుకు చిరంజీవి (Chiranjeevi) ఓ సినిమా చేయాలి.

ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని చూస్తే… నెల్సన్‌ దిలీప్‌ తర్వాతి సినిమా చిరంజీవిది అవ్వొచ్చు అని చెబుతున్నారు. మరి నెల్సన్‌ చెప్పే కథ చిరంజీవికి నచ్చుతుందా, చేస్తారా అనేది చూడాలి. అయితే నెల్సన్‌ దిలీప్‌ డిస్కషన్‌ లైనప్‌లో ధనుష్‌, అల్లు అర్జున్‌ లాంటి పేర్లు ఉన్నాయి అంటున్నారు. చూడాలి మరి ఏ సినిమా ముందుకెళ్తుందో? ఏది పట్టాలెక్కుతుందో?

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus