మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమా కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో డిఓషనల్ టచ్ ఉండి గ్రాఫిక్స్ బాగా ఉంటే ప్రేక్షకులు ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఆ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ చెబుతున్నారు. అఖండ , కార్తీకేయ 2, కాంతార లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ .. ఈ సినిమాలు అన్నిటి విషయాల్లో అదే జరిగింది. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని అలాంటి సినిమాలను రూపొందిస్తున్నారు మేకర్స్.
అయితే టెక్నాలజీ లేని రోజుల్లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్ తో దివంగత స్టార్ దర్శకులు కోడి రామకృష్ణ అంజి అనే సినిమాని రూపొందించారు. ఆ సినిమాలో గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ అయితే గూజ్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ టైమ్ లో వచ్చి ఉంటే కచ్చితంగా అంజి పెద్ద హిట్ అయ్యి ఉండేది అనేది చాలా మంది నెటిజెన్ల అభిప్రాయం. ఏదేమైనా చిరంజీవి చేసిన సినిమాల్లో అంజి కి ప్రత్యేక స్థానం ఉంది అనేది వాస్తవం.
ఇదిలా ఉండగా.. అంజి సినిమాకి ఫస్ట్ ఆప్షన్ చిరంజీవి కాదట.ఈ సినిమా కోసం ఇంకో స్టార్ హీరోని సంప్రదించారట. అతను మరెవరో కాదు.. వెంకటేష్. ముందుగా వెంకటేష్ కి కోడి రామకృష్ణ అంజి, దేవీ పుత్రుడు కథలు వినిపించారు. వెంకటేష్ కి రెండు కథలు నచ్చాయి. దీంతో అంజి ని ముందుగా వెంకటేష్ తో చేయాలి అనుకున్నారు కోడి రామకృష్ణ. కానీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. అనుకోకుండా చిరంజీవికి అంజి కథ గురించి చెప్పారు.
అది చిరుకి నచ్చింది. దీంతో వెంకీ దేవీపుత్రుడు కథని ఓకే చేసారు. వాస్తవానికి అంజి (Anji) షూటింగ్ ముందుగా మొదలైంది. కానీ తర్వాత అనేక సమస్యలు రావడంతో ఆ సినీనటుడు షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఈ క్రమంలో కోడి రామకృష్ణ.. వెంకటేష్ తో దేవీపుత్రుడు ని సెట్స్ పైకి తీసుకెళ్లి కంప్లీట్ చేశారు. 2001 సంక్రాంతికి దేవీ పుత్రుడు రిలీజ్ అయ్యింది. 2004 సంక్రాంతి కి అంజి సినిమా రిలీజ్ అయ్యింది. కాని రెండు సినిమాల ఫలితాల్లో తేడా లేదు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!