Chiranjeevi: బేబీ ఈవెంట్లో చిరు ధరించిన వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వారందరూ కూడా వారి క్రేజ్ , ఫాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఎంతో ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువు బ్రాండెడ్ అయినది అలాగే ఎంతో ఖరీదైనవి వాడుతుంటారు. వారు వేసుకుని షూ నుంచి మొదలుకొని తిరిగే కార్లు ఉండే ఇల్లు వరకు కూడా చాలా ఖరీదై ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక సినిమా వేడుక కోసం, లేదా ఏదైనా కార్యక్రమాల కోసం సెలబ్రిటీలు కనుక బయటకు వస్తే వారిపైనే అభిమానుల దృష్టి ఉంటుంది.

ఈ క్రమంలోనే వారు ఎలాంటి బ్రాండ్ కు సంబంధించిన దుస్తులు వేసుకున్నారు, ఎలాంటి వాచ్ కట్టుకున్నారన్న విషయాలపై ఫోకస్ చేసి వాటి ధర ఎంత ఉంటుందనే విషయాల గురించి ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలోనే బేబీ సినిమా చాలా మంచి హిట్ అవడంతో చిరంజీవి మెగాకల్ట్ ఈవెంట్ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి చిరంజీవి చాలా స్టైలిష్ లుక్ లో హాజరై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవి (Chiranjeevi) ధరించినటువంటి వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోని చిరంజీవి ఈ వాచ్ ఏ బ్రాండ్ కు చెందినది దీని ధర ఎంత అంటూ ఆరా తీయగా నేటిజన్స్ కి దిమ్మతిరిగింది. బేబీ సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ను పెట్టుకున్నాడు.

ఈ వాచ్ మార్కెట్ విలువ ఏకంగా 230,000 డాలర్లు. అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే.. అక్ష‌రాల‌ 1.89 కోట్లు. అంటే దాదాపుగా 2 కోట్లు విలువ చేసే వాచ్ ను చిరంజీవి పెట్టుకున్నారు. ఇలా ఈ వాచ్ ఖరీదు తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus