మేనల్లుడుని ఫాలో అవుతున్న చిరు

కారణాలు ఏమన్నా కావొచ్చు… తెలుగు సినిమాల్లో అడవులు నేపథ్యంలో సీన్స్‌ అంటే మన చిత్రబృందం కేరళ ఫ్లైట్‌ ఏక్కేస్తుంటుంది. అక్కడి అడవులు బాగుంటాయనో, లేక ఇంకేమో కానీ అక్కడికి చెక్కేస్తుంటారు. షూటింగ్‌ చేసేసి వచ్చేస్తుంటారు. అయితే కరోనా కారణంగా ఇప్పుడు వేరే ప్రాంతాల్లో సినిమా అంటే విదేశాలకు తప్ప ఇంకెక్కడీ వెళ్లడం లేదు. దీంతో అడవుల సీన్స్‌ కావాలంటే అందరి చూపు మారేడుమిల్లి మీద పడుతోంది. ఇటీవల అక్కడ అల్లు అర్జున్‌ – సుకుమార్‌ పుష్ప షూటింగ్‌ మొదలెట్టారు. తాజాగా మరో సినిమా అక్కడికి వెళ్తోందట.

‘పుష్ప’ షూటింగ్‌ కోసం సుకుమార్‌ అండ్‌ కో తెలుగు రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలను చుట్టేశారు. మొత్తంగా వెతికి, వెతికి మారేడుమిల్లి అడవులకు వెళ్లిపోయారు. అక్కడ చక్కగా షూటింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా ఫారెస్ట్‌ స్పాట్‌ మారేడుమిల్లిగా మారేలా కనిపిస్తోంది. చిరంజీవి – కొరటాల శివ ‘ఆచార్య’లో ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ ఉన్నాయనే విషయం ఇంతకు ముందే విన్నాం. చిరంజీవి నక్సలైట్‌గా కనిపించే సీన్స్‌ అడవిలోనే తీయాలి. దీని కోసం కేరళ వెళ్లాలని గతంలో అనుకున్నారు. అయితే ఇప్పుడు వాటిని ఇక్కడే తీసేస్తారట.

తొలుత ఫారెస్ట్‌ సీన్స్‌ కోసం భారీ సెట్‌ వేస్తారని వార్తలొచ్చాయి. అయితే మారేడుమిల్లిలో షూటింగ్‌ చేయాలని నిర్ణయించారట. ‘పుష్ప’ షూటింగ్‌కి సుకుమార్ బ్రేక్‌ ఇస్తే… ‘ఆచార్య’ను కొరటాల అక్కడికి తీసుకెళ్తాడట. దీని కోసం ఇప్పటికే పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆ లెక్కన మిగిలిన సినిమాలు కూడా మారేడుమిల్లికి క్యూ కడతాయేమో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus