చిరంజీవి జనసేన పార్టీలోకి రారని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ ఇద్దరి ఆలోచనలు కలవవు అని వెల్లడించారు. జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద్భంగా జనసేన పార్టీ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ విధానాలు.. పార్టీ నిర్మాణం.. లక్ష్యాలపై మాట్లాడారు.
పార్టీని ఆదరించిన అభిమానులు, సహకరించిన మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆలోచన విధానాన్ని ప్రజలతో పంచుకునేందుకు వెబ్‌సైట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘ప్రజల్లోకి వెళ్లేందుకు 32 అంశాలను గుర్తించాం. జూన్ నుంచి పార్టీ నిర్మాణం ప్రారంభమవుతుంది. జనసేన పార్టీకి బలమైన కార్యకర్తలున్నారు. 60 శాతానికి యువతకు సీట్లిస్తాం. పార్టీ నిర్మాణం పూర్తయ్యాక పొత్తులపై ఆలోచిస్తాం’’ అని తెలిపారు. ఇంకా జనసేనాని మాట్లాడుతూ “రెండు రాష్ట్రాల్లో పార్టీ పోటీచేస్తుంది. ఏపీ నుంచే నేను పోటీ చేస్తా. కానీ ఎక్కడి నుంచి అనేది తర్వాత చెబుతా. అనంతపురం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తా. అధికారం వచ్చినా, రాకపోయినా ప్రజలకోసం పార్టీ ఉంటుంది” అని స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీలో కొంతమంది వ్యక్తుల పరిశీలించిన అనుభవంతో, అక్కడి తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చేస్తానని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.