Chiranjeevi, Ram Charan: పుత్రోత్సాహంతో పొంగిపోతున్న మెగాస్టార్.. గర్వంగా ఉందంటూ ఎమోషనల్ కామెంట్స్!

మెగా వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఫాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ రావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రామ్ చరణ్ తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారు. ప్రముఖ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా కార్యక్రమంలో ట్రూ లెజెండ్‌గా అవార్డు అందుకున్నారు. ఈ విధంగా రామ్ చరణ్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రామ్ చరణ్ ఈ విధమైనటువంటి అవార్డు అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కంగ్రాట్స్ డియర్ చరణ్ ఫ్యూచర్ ఆఫ్ ఇన్ ఇండియాలో ది ట్రూ లెజెండ్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు అందుకున్న తర్వాత నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇలాగే ముందు ముందు మరెన్నో గొప్ప అవార్డులు అందుకోవాలని నేను అమ్మ కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఈ పోస్ట్ పై చరణ్ థాంక్ యు అప్పా అంటూ రిప్లై ఇచ్చారు. ఇక మెగా అభిమానులు సైతం రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus