Chiranjeevi, Trivikram: చిరంజీవి లైనప్‌లో ఈ సినిమా కూడా పడితే.. ఉంటాది!

చిరంజీవి అన్ని రకాల జోనర్లు సినిమాలు చేస్తారు, అదరగొట్టేస్తారు అని చెప్పడం అంటే.. పాలు తెల్లగా ఉంటాయని చెప్పడం లాంటిదే. ఎందుకంటే ఈ రెండూ అందరికీ తెలుసు. అందుకేనేమో చిరు ఫ్యాన్స్‌ చాలా రోజుల నుండి మంచి కామెడీ సినిమా వస్తే చూద్దాం అనుకుంటున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టినప్పటి నుండి చిరంజీవి నుండి ఫుల్‌ ప్లెడ్జ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ కానీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కానీ రాలేదు. అయితే ఆ లోటు తీర్చడానికి చిరంజీవి సిద్ధమవుతున్నారని టాక్‌.

చిరంజీవి ప్రజెంట్‌ లైనప్‌ చూసుకుంటే అన్నీ యాక్షన్‌ సినిమాలే అని చెప్పొచ్చు. ఫ్యామిలీ మొత్తం చూసే కథ ఉన్న సినిమాలు కనిపించడం లేదు. మొన్నీమధ్య వచ్చిన ‘ఆచార్య’ పరాజయం ఫ్యాన్స్‌ మరచిపోవాలి. దాని కోసం ‘గాడ్‌ఫాదర్‌’ అంటూ ఆగస్టులో చిరంజీవి వస్తారని టాక్‌. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ వస్తుంది. ఆ తర్వాత ‘భోళా శంకర్‌’ సినిమా తీసుకొస్తారు. దాని తర్వాత చిరంజీవి వెంకీ కుడుమలకు ఓ సినిమా చేస్తారు. ఆఖరి సినిమా కామెడీ సినిమా కావొచ్చు అంటున్నారు.

అయితే ఈ లైనప్‌ మధ్యలోకి త్రివిక్రమ్‌ సినిమా ఒకటి వచ్చే చేరే అవకాశం ఉందని చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. కొన్ని రోజుల క్రితం, చిరంజీవి విదేశాలకు వెళ్లకముందు చిరంజీవి – త్రివిక్రమ్‌ భేటీ జరిగిందట. ప్రముఖ నిర్మాత ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది అంటారు. ఈ క్రమంలో ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలి అనుకున్నారట. అయితే దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు అని సమాచారం. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే ఆటోమేటిగ్గా చిరంజీవి లైనప్‌లో ప్రయారిటీ దీనికే ఉంటుంది.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఆలోచనలన్నీ మహేష్‌బాబు సినిమా మీదే ఉన్నాయి. ఆ సినిమా లెక్క తేలిన తర్వాతే మిగతావి. అదేమో ఆలస్యమవుతూ వస్తోంది. ఆ సినిమా పూర్తయి, విడుదలవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. ఈలోపు చిరంజీవి అన్ని సినిమాలు పూర్తి చేసుకుంటే ఈ ప్రాజెక్ట్‌ ఉండొచ్చు. అయితే గతంలో సుబ్బరామిరెడ్డి నిర్మాణంలో చిరంజీవి – పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా అనుకున్నారు. కేవలం ప్రకటనకే ఆ సినిమా పరిమితమైపోయింది. ఇప్పుడు ఇదైనా అవుతుందేమో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus