Chiranjeevi, Balayya Babu: చిరంజీవి కథ బాలయ్యకు వెళ్లిందా..?

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్.. మెగాస్టార్ చిరంజీవి కోసం ‘ఆటో జానీ’ అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా గురించి చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరంజీవి సినిమాలు చేయడం ఆపేసిన తరువాత ఈ ప్రాజెక్ట్ గురించి అందరూ మర్చిపోయారు. చిరు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పూరి వెళ్లి చిరుకి కథ చెప్పారు.

కానీ ఎందుకో ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు. ఇన్నాళ్ల తరువాత మెగాస్టార్ స్వయంగా ‘ఆటో జానీ’ సబ్జెక్ట్ ఉందా..? అని ప్రశ్నించారు. దానికి పూరి.. ‘అది వద్దు.. మీ కోసం మంచి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నా. పూర్తయ్యాక వచ్చి కలుస్తాను’ అని చెప్పారు. పూరి అలా చెప్పడానికి ఓ కారణం ఉందట. అదేంటంటే.. ‘ఆటో జానీ’ కథ పూరి ఎప్పుడో వాడేశారట. ఆ కథనే టైటిల్ మార్చి, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి సినిమా తీశారట.

ఆ సినిమానే ‘పైసా వసూల్’. పూరి సన్నిహితవర్గాల ద్వారా ఈ విషయం బయటకొచ్చింది. అందుకే పూరి నేరుగా ఈ స్క్రిప్ట్ గురించి చెప్పకుండా.. వేరే కథ రెడీ చేస్తున్నానని చిరుకి చెప్పారు. ఏదైతేనేం.. ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఆ పాత్రకి ఆయన బాగా సూట్ అయ్యారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇక పూరి విషయానికొస్తే.. ఇటీవల ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం పూరి కొంత బ్రేక్ తీసుకొని మరో కథను రెడీ చేయబోతున్నారు. ఈసారైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus