Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ హిట్ మూవీ రీరిలీజ్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  పుట్టినరోజుకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తేదీన రీరిలీజ్ కావాల్సిన ఇంద్ర (Indra)  మూవీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇంద్ర మూవీ రీరిలీజ్ వాయిదా పడటం ఫ్యాన్స్ కు ఒకింత బాధను కలిగించింది. అయితే ఇంద్ర రీరిలీజ్ కాకపోయినా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada M.B.B.S) మూవీ రీరిలీజ్ కానుండటం గమనార్హం. శంకర్ దాదా ఎంబీబీఎస్ 4కే వెర్షన్ ఆరోజు రీరిలీజ్ కానుంది.

Chiranjeevi

మరోవైపు ఇంద్ర ఆ తేదీన రీరిలీజ్ అవుతుందో లేదో మేకర్స్ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్, పర్ఫామెన్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

జయంత్ సి పరాన్జీ (Jayanth C. Paranjee) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా సోనాలి బింద్రే (Sonali Bendre) నటించడం జరిగింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ రీరిలీజ్ కు సంబంధించిన ప్రకటన మెగా అభిమానుల్లో జోష్ నింపింది. మరోవైపు చిరంజీవి పుట్టినరోజు విశ్వంభర (Vishwambhara) సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది.

విశ్వంభర సినిమాకు సంబంధించిన మేజర్ సన్నివేశాల షూట్ ఇప్పటికే పూర్తైంది. మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) మెగాస్టార్ తో ఎలాంటి సినిమాను తెరకెక్కించారో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. విశ్వంభర సినిమా సక్సెస్ సాధిస్తే మల్లిడి వశిష్ట స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విశ్వంభర సినిమా కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

 వైరల్ అవుతున్న పవన్ ఆద్య సెల్ఫీ.. రేణూ దేశాయ్ ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus