మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసీఫర్’ ను తెలుగులో రీమేక్ చెయ్యాలని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎప్పుడో రైట్స్ కొనుగోలు చేసి పెట్టుకున్నాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో ఈ చిత్రాన్ని రూపొందించాలని చరణ్ ట్రై చేసాడు.ఈ క్రమంలో సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ ఇలా చాలా మంది డైరెక్టర్లను సంప్రదించాడు. చివరికి ‘సాహో’ దర్శకుడు సుజీత్ ను ఫిక్స్ చేసాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ రెడీ చేసిన స్క్రిప్ట్ కు మెగాస్టార్ సంతృప్తి చెందక..
తనకు అత్యంత సన్నిహితుడైన డైరెక్టర్ ను రంగంలోకి దింపాడట. అయితే ఆ డైరెక్టర్ మెగాస్టార్ కు.. ‘ఈ లూసీఫర్ రిమేక్ వద్దు. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఎన్నో ప్లాట్ ఫామ్స్ లో ఈ చిత్రం తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా చాలా మంది చూసేస్తున్నారు. మనం చూపించే కొన్ని మార్పులకు జనం థియేటర్లకు వస్తారు అన్న గ్యారెంటీ ఉండదు’ అని చెప్పాడట. ఈ డైరెక్టర్ కామెంట్స్ తో ఆలోచనలో పడ్డ మెగాస్టార్..
ప్రస్తుతానికి ఈ ‘లూసీఫర్’ ను పక్కన్న పెట్టి.. ‘ఆచార్య’ పూర్తవ్వగానే.. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో డైరెక్టర్ బాబీతో సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఆల్రెడీ అతను 80శాతం స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. మిగిలిన 20 శాతం స్క్రిప్ట్ చిరు చెప్పిన మార్పులే అని తెలుస్తుంది. దీంతో ‘లూసీఫర్’ చిత్రం రిమేక్ ప్రస్తుతానికి నిలిచిపోయినట్టే అని ఇన్సైడ్ టాక్.
Most Recommended Video
చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!