మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్నాడు.సమ్మర్ కానుకగా మే 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. రాంచరణ్ .. సిద్ద అనే కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం విడుదలయ్యేలోపే మెహర్ రమేష్ తో ‘వేదాలం’ రీమేక్ ను పూజా కార్యక్రమాలతో అనౌన్స్ చేసి..
దాంతో పాటు ‘లూసిఫర్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలుపెట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.దీనికి మోహన్ రాజా దర్శకుడు. ఈ రెండు ప్రాజెక్టులను కూడా సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసెయ్యాలని చిరు పక్కా ప్లాన్ తో ఉన్నారు. 2022 సంక్రాంతి కానుకగా ‘లూసిఫర్’ రీమేక్ ను విడుదల చెయ్యాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం.ఒరిజినల్ తో పోలిస్తే.. ఇందులో చాలా మార్పులు ఉండబోతున్నాయట. హీరోయిన్ ట్రాక్ అలాగే పాటలను కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారని వినికిడి.
అలాగే ‘వేదాలం’ రీమేక్ ను కూడా 2022 సమ్మర్ ఫినిష్ అయ్యేలోపు విడుదల చెయ్యాలని చిరు భావిస్తున్నారట. కుర్ర హీరోలు..ఇప్పటి స్టార్ హీరోలే ఏడాదికి ఓ సినిమా చెయ్యడానికి విలవిలలాడిపోతున్న ఈరోజుల్లో.. 65ఏళ్ళ వయసున్న మెగాస్టార్ చిరంజీవి రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. అంటే ఈ సమ్మర్ నుండీ 2022 సమ్మర్ వరకూ 6 నెలలకు ఓ సినిమా మెగాస్టార్ నుండీ రాబోతుందన్న మాట.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?