‘ఆహా’ మెగాస్టార్ చిరంజీవికి భారీ పారితోషికం అందించిన అల్లు అరవింద్..!

అల్లు అరవింద్ గారు లాక్ డౌన్ కు ముందు ‘ఆహా’ అనే ఓటిటిని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టోటల్ గా తెలుగు కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఆరంభం నుండే ‘ఆహా’ కు మంచి ఆదరణ దక్కింది.కరోనా లాక్ డౌన్ కూడా ‘ఆహా’ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. షూటింగ్ లు కూడా కొన్నాళ్ళ పాటు ఆగిపోయాయి కాబట్టి.. మొదట్లో ‘ఆహా’ తక్కువ కంటెంట్ ఉంది అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌తో ‘ఆహా’ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.

అంతేకాకుండా స్టార్ హీరోయిన్ సమంతను కూడా రంగంలోకి దింపారు. ఆమెతో ‘సామ్ జామ్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే ఆ ఎపిసోడ్ కు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. దీంతో అల్లు అరవింద్ గారు అస్సలు తగ్గకుండా ఏకంగా మన మెగాస్టార్ చిరంజీవిని లాక్కోచ్చేసారు. మొదట అరవింద్ గారు చిరంజీవితో ఫినాలే ఎపిసోడ్ ను నిర్వహించాలి అనుకున్నారట. కానీ ఇప్పుడున్న నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ ను పోగట్టడానికి మెగాస్టారే బెస్ట్ ఆప్షన్ అని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

‘సామ్ జామ్’ కోసం మెగాస్టార్ కు పారితోషికం గట్టిగానే ముట్టచెప్పారట అరవింద్ గారు. అయితే అది ఎంత? అనే విషయం ఇంకా బయటకు రాలేదు. ఇక ఈ షో కోసం మెగాస్టార్ పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus