Vishwambhara: కెరీర్ లో తొలిసారి అలా చేసిన చిరంజీవి.. ఆ రేంజ్ లో గుర్తింపు వస్తుందా?

30 సంవత్సరాల క్రితం స్టార్ హీరోల సినిమాల షూటింగ్ మొత్తం నెలరోజుల్లో పూర్తైన సందర్భాలు సైతం ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమా రెండు నుంచి మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి (Chiranjeevi) మల్లిడి వశిష్ట (Mallidi Vashista) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) సినిమాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కాగా ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్ కోసం ఏకంగా 26 రోజుల సమయం పట్టిందని తెలుస్తోంది. చిరంజీవి కెరీర్ లోని బెస్ట్ ఫైట్ సీన్లలో ఈ సీన్ ఒకటిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ శివార్లలోని భారీ సెట్ లో ఈ ఫైట్ సీన్ షూటింగ్ జరగగా ఈ ఫైట్ సీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసే ఫైట్ సీన్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో దొరబాబు అనే రోల్ లో చిరంజీవి కనిపించనున్నారు.

చిరంజీవి ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చిరంజీవి కీరవాణి కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. 2025 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుండటం గమనార్హం.

స్టార్ హీరో చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం ఉంది. విశ్వంభర సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. విశ్వంభర సినిమా కథ, కథనం కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. విశ్వంభర అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. చిరంజీవికి సంక్రాంతి కలిసొచ్చిన సీజన్ కాగా ఈ సినిమాతో మెగాస్టార్ మరో సంక్రాంతి హిట్ అందుకుంటారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus