అభిమానులకి షాక్ ఇచ్చిన ‘చిరు 152’ యూనిట్..!

‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు… కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ‘మెగాస్టార్ 152’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి ‘బిల్లా రంగా’ ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ ‘చక్రవర్తి’ వంటి చిత్రాల్లో హీరోలుగా నటించారు. అంతేకాదు ‘మంచి దొంగ’ ‘కొదమ సింహం’ ‘ఖైదీ నెంబర్ 150’ వంటి చిత్రాల్లో చిరు హీరోగా నటించగా విలన్ గా మోహన్ బాబు నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారని ఇటు మెగా అభిమానులు కూడా సంబరపడిపోయారు.

Mohan Babu with Chiranjeevi

అయితే ఈ వార్తల్లో నిజం లేదంటూ ‘మెగాస్టార్ 152’ చిత్రం యూనిట్ సభ్యులు తెలియజేసారు. ‘మోహన్ బాబు గారి రేంజ్ కు సరిపడా పాత్ర మా చిత్రంలో లేదు. ఉంది ఉంటే కచ్చితంగా మేమే తెలియజేసేవాళ్ళం. దయచేసి ఆ వార్తలను నమ్మొద్దు’ అంటూ చెప్పుకొచ్చారు. వారు ఇలా ప్రకటించడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారని తెలుస్తుంది. ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus