సైరా నరసింహ రెడ్డి లో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పనున్న చిరు!

తొలి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న సైరా  నరసింహా రెడ్డి సినిమాకి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు నటించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పరుచూరి బ్రదర్స్ స్టోరీ, సీన్స్ రాయడం పూర్తి చేశారు. ప్రస్తుతం చిరుకు తగ్గట్టు ఒళ్ళు గగుర్పొడిచేలా ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా మాటలు రాసే పనిలో ఉన్నారు.

Click Here For Review

అప్పటి చరిత్రను బాగా చదివి నరసింహారెడ్డి పౌరుషం ఉట్టిపడేలా మాటలు రాస్తున్నారని తెలిసింది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus