Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

‘లెనిన్‌’ సినిమా ప్రచారం సమయంలో అఖిల్‌ తొలిసారి తన చేతి గాయం గురించి చెప్పాడు. అప్పటివరకు అఖిల్‌ సినిమాల గ్యాప్‌కి కారణం అతని గత సినిమాల ఫలితాలే అని అనుకున్నారంతా. కానీ అసలు కారణం గాయమని తెలిసి.. అయ్యో అనుకున్నారు. చేతికి బలమైన గాయమైంది అని చెప్పిన అఖిల్‌.. ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. తన గాయానికి కారణంం, ఆ నాటి పరిస్థితుల్ని వివరంగా చెప్పుకొచ్చారు.

Akhil Akkineni

‘ఏజెంట్‌’ సినిమా తర్వాత మరో సినిమా కోసం అఖిల్‌ తన బాడీని బిల్డ్‌ చేశాడు. జిమ్, డైట్‌ అన్నీ సెట్‌ చేసుకొని తర్వాత సినిమా కోసం రెడీ అయ్యాడు. త్వరలో సినిమా షూటింగ్‌ మొదలుపెడదాం అనుకున్నారు. అయితే అప్పటికే కొన్ని రోజుల నుండి రెస్ట్‌ లేకుండా ఉండటం వల్ల తన పార్ట్‌నర్‌ (జైనబ్‌)తో కలసి నాలుగు రోజుల విహారయాత్రకు వెళ్లారు. అలా వెళ్లిన ఒక రోజు తర్వాత బీచ్‌లో అలా నడుద్దాం అని రెడీ అయ్యారట. ఆ ఏరియా కాస్త తడిగా ఉందట. ఈ క్రమంలో కాలు జారి కిందపడిబోయాడు.

ఆ సమయంలో చేయి తగిలి అక్కడే ఉన్న గాజు గ్లాస్‌ కిందపడి విరిగిపోయిందట. అదే సమయంలో కాలు అదుపు తప్పి.. ఆ గ్లాస్‌ మీద పడిపోయాడట. ఓవైపు మోకాలుకి దెబ్బ తగిలిందట. అదే సమయంలో అరచేతిని చూస్తే.. గాజు గుచ్చుకొని చర్మం విడిపోయి లోపల ఎముక కనిపించిందట. వెంటనే ఆ ప్రాంతంలో ఓ అసుపత్రికి వెళ్తే 48 కుట్లు వేశారట. ఆ తర్వాత ఇండియా వచ్చాక చూస్తే కుట్లు సరిగ్గా వేయలేదు అని తేలింది. వెంటనే ఇక్కడ వైద్యం చేయించారు. నరాలకు సంబంధించిన సమస్య వచ్చిందని తేలింది. ఒక వేలు పూర్తిగా పట్టు తప్పిందని వైద్యులు చెప్పారట.

ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత సర్జరీ చేశారు. ఆ వెంటనే ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. ఈ సర్జరీలు అయ్యాక ఏడెనిమిది నెలలు వేళ్లు మునపటి పరస్థితికి రాలేకపోయాడట అఖిల్‌. ఫిజియో థెరపీ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. ఈ మొత్తం ప్రాసెస్‌ 16 నెలలు పట్టింది అని చెప్పాడు అఖిల్‌.

మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus