చిరంజీవి సినిమాల జడ్జిమెంట్ ఎప్పుడూ పక్కాగా ఉంటుంది. ఆయన ఒక్కడే ఇంట్లో ప్రత్యేకంగా సినిమా వేయించుకుని చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అలా చూశాక ఆయన చెప్పే మాట నూటికి నూరు శాతం కరెక్ట్ అవుతాయని అందరూ అంటుంటారు. ఆయన సినిమా చూశాక చెప్పే కరెక్షన్లు సినిమాకు ప్లస్ అవుతాయి అంటుంటారు. తాజాగా ఆయన చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ చూశారట. చూశాక ఆయన అన్న మాటలు కొన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
‘‘సినిమాకు వచ్చే డబ్బులు, అవార్డుల సంగతి పక్కనపెట్టేస్తే… నీకైతే మంచి పేరు వస్తుంది’’ అని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానతో చిరంజీవి అన్నారట. తొలి సినిమాతో ప్రతి దర్శకుడు పేరు కోరుకుంటాడు. కానీ దాంతో పాటు సినిమా హిట్ అయ్యి మంచి వసూళ్లు రావాలి. అలాగే ప్రశంసలు, అవార్డులు కూడా రావాలని కోరుకుంటారు. కానీ కేవలం పేరు మాత్రమే వస్తే ఏమొస్తుంది. అంటే సినిమా ఫలితం మీద చిరంజీవి అంతగా నమ్మకం లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ఉప్పెన’ను ఓటీటీ విడుదల కోసం చాలామంది అడిగినా… నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓకే చెప్పలేదు. దీని వెనుక మెగా ఫ్యామిలీ ఉందనేది స్పష్టం. మెగా మేనల్లుడు ఎంట్రీ ఇలా ఓటీటీతో కాకూడదనేది వారి ఉద్దేశం. అందుకుతగ్గట్టుగానే మైత్రీ వాళ్లు సినిమాను ఆపి, ఆపి ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి అన్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు.
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!