డబ్బింగ్ షురూ చేసిన చిరు..!

తొమ్మిదేళ్ల విరామం తర్వాత చిరు ‘ఖైదీ నెం 150’తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ చిత్రం ‘కత్తి’కి రిమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పనులు శరవేగంగా సాగిస్తున్నాయి. జూన్ చివరిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ చిన్నపాటి విరామం మినహా వేగవంతంగానే జరుగుతుందట. తాజా సమాచారం ప్రకారం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా మొదలయ్యాయట.ఇప్పటివరకు పూర్తయిన చిత్రీకరణలో చిరు తన పార్ట్ కు డబ్బింగ్ చెప్పడం ఆరంభించారు.

చిరు-కాజల్ కలయికలో ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు డబ్బింగ్ చెప్తుండటం విశేషం. మరో ఇదంతా చిరు తనయుడు, ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రణాళికే అని తెలుస్తోంది. సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉంటుందని చెర్రీ సూచించాడట. ఇన్నేళ్ల విరామం తర్వాత చిరు సినిమా చేస్తున్నారు గనక ఆ సినిమా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని చిత్ర బృందం కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారట. దీంతోపాటు చిరు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న “మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమం త్వరలో మొదలవనుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని “ఖైదీ నెం 150” పనులను వేగవంతం చేశారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus