శివాజీ రాజా, ధనరాజ్, రవి బాబు, రాజా రవీంద్ర,కాశీ విశ్వనాథ్, మీనా కుమారి,అన్నపూర్ణ, రచ్చ రవి తదితరులు (Cast)
ఆర్ ఎన్ హర్షవర్ధన్ (Director)
శేషు మారంరెడ్డి, భాగ్యలక్ష్మీ బోయపాటి (Producer)
రథన్ (Music)
జవహర్ రెడ్డి (Cinematography)
Release Date : మే 11, 2024
’90’s వెబ్ సిరీస్’ (90’s – A Middle-Class Biopic) సూపర్ సక్సెస్ అవ్వడంతో ‘ఈటీవీ విన్’ పై జనాల ఫోకస్ పడింది. కానీ ఆ తర్వాత ఆ సూపర్ హిట్ సిరీస్..ని మ్యాచ్ చేసే కంటెంట్ అయితే అందులో పడలేదు. అయితే వరుణ్ సందేశ్ హీరోగా రూపొందిన ‘చిత్రం సూడర’ మూవీ నేరుగా ‘ఈటీవీ విన్’ లో రిలీజ్ అయ్యింది. మరి ఇదైనా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉందేమో తెలుసుకుందాం రండి :
కథ : కొత్తపట్నం కి చెందిన బాలా (వరుణ్ సందేశ్) (Varun Sandesh) ఓ డ్రామా ఆర్టిస్ట్. ‘రుక్మిణీ డ్రామా కంపెనీ’లో అతను పని చేస్తూ ఉంటాడు. అతను పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) వీరాభిమాని. అలాగే తిక్క మనిషి కూడా..! అయితే తన డ్రామా కంపెనీ పనిలో భాగంగా ఓ రోజు అతను లొకేషన్స్ చూడటానికి వేరే ఊరు వెళ్తాడు. అక్కడ ఓ ప్రొడక్షన్ హౌస్ కి మేనేజర్ అయినటువంటి మల్లేశం (శివాజీ రాజా (Sivaji Raja) ని కాలుస్తాడు. తమ అప్ కమింగ్ ప్రాజెక్టులో హీరో ఫ్రెండ్ రోల్ ఉందని.. కాబట్టి హైదరాబాద్ వచ్చి కలవమని బాలాతో చెబుతాడు. ‘సినిమాలో ఛాన్స్ కదా’ అనే ఆసక్తితో బాలా అలాగే అతని స్నేహితులు రంగారావు (కాశీ విశ్వనాథ్), మొద్దు (ధనరాజ్ (Dhanraj)తో కలిసి హైదరాబాద్ వెళ్తాడు.
అలా వెళ్లిన వీరు అనుకోకుండా ఓ దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. దీంతో సీఐ సారంగపాణి (రవిబాబు) (Ravi Babu) వీరిని అరెస్ట్ చేస్తాడు. కానీ మల్లేశం, సారంగపాణి..ల స్కామ్ వల్లే బాలా అండ్ టీం ఇరుక్కున్నారు అనే విషయం వారికి తెలియదు. ఈ క్రమంలో ఓ మాజీ వేశ్య, జూనియర్ ఆర్టిస్ట్ అయిన చిత్ర (శీతల్ భట్) బాలా అండ్ టీంకి ఎలా సాయపడ్డారు. ఎలా వారు కేసు నుండి బయటపడ్డారు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : వరుణ్ సందేశ్ యాక్టింగ్ పెద్దగా మెప్పించింది లేదు. డైలాగ్ డెలివరీ కూడా తన గత సినిమాల్లో మాదిరే ఉంది. ఇక బాలా పాత్ర కూడా అతనికి ఉన్న మినిమమ్ ఇమేజ్ కి తగినది కాదు. అయినా అతను ఒప్పుకుని చేశాడు అంటే ఖాళీగా ఉండటం వల్లే అనుకోవాలేమో. ‘బిగ్ బాస్’ తో వచ్చిన క్రేజ్ తో అతని సెకండ్ ఇన్నింగ్స్ ని అద్భుతంగా ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఉన్నా.. ఆ దిశగా అతను ప్రయత్నాలు చేయడం లేదు అని ఈ సినిమాతో అందరికీ ఓ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది.
హీరోయిన్ శీతల్ భట్ నటనతో కాకుండా గ్లామర్ తోనే నెట్టుకురావాలని చూసింది. పోలీ అలా కూడా ఈమె లుక్స్ అంత అట్రాక్టివ్ గా అనిపించవు. రవిబాబు, శివాజీ రాజా, తనికెళ్ల భరణి (Tanikella Bharani) , రాజా రవీంద్ర (Raja Ravindra) , కాశీ విశ్వనాథ్ ..ల పాత్రలు ఏమాత్రం కొత్తగా ఉండవు.గతంలో వారు అనేక సార్లు చేసిన పాత్రల్లానే ఉంటాయి. ధనరాజ్, రచ్చ రవి (Racha Ravi) కామెడీ కూడా నవ్వించేలా ఉండదు.
సాంకేతిక నిపుణుల పనితీరు : క్రైమ్ కామెడీ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ జోనర్లో కూడా కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చేస్తున్నాయి. సో అన్ని కథలు ఒకేలా అనిపిస్తున్నాయి. సరే కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా డిజైన్ చేసుకుంటే ఫలితం ఆశించిన విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ‘చిత్రం చూడర’ విషయంలో అలాంటి ఆకట్టుకునే అంశాలు లేవు. ఆర్ఎన్ హర్షవర్ధన్ రాసుకున్న కథ కొత్తగా ఉండదు.
క్రైమ్ ఎలిమెంట్స్ గ్రిప్పింగ్ గా అనిపించవు, కామెడీ సిల్లీగా అదే సమయంలో ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఏ సీన్ కూడా కొత్తగా, ఎంగేజ్ చేసే విధంగా ఉండదు. డైరెక్షన్ పూర్తిగా మైనస్ అనే చెప్పాలి. రథన్ (Radhan) సంగీతంలో రూపొందిన పాటలు ఓకే అనిపిస్తాయి. అలా అని గుర్తు చేసుకుని, పాడుకునే రేంజ్లో ఉండవు. సినిమాటోగ్రఫీ సో సో గా ఉంది.ఎడిటింగ్ కూడా మైనస్ అనే చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా కనీస స్థాయిలో లేవు.
విశ్లేషణ : ‘చిత్రం చూడర’ ఓ బోరింగ్ క్రైమ్ కామెడీ మూవీ. 2:06 గంటల క్రిస్ప్ రన్ టైం మినహా చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ ఏమీ లేదు.
రేటింగ్ : 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus