Brahmamudi: స్వప్న ప్రవర్తన పై సీరియస్ అయిన చిట్టి!

కుటుంబ కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…కళ్యాణ్ గ్రౌండ్ కి వచ్చానని అప్పుకి ఫోన్ చేయడంతో అప్పు తాను రానని చెబుతుంది. దీంతో కళ్యాణ్ ఎందుకు రావడం లేదు ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తాడు.అంతలోపు అప్పు ఎవరో బండి మీద వెళ్లడం చూసి పిలుస్తాడు వినిపించకపోవడంతో తననే ఫాలో అవుతాడు.

ఇక వారు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని డబ్బు ఇస్తానని చెప్పిన తీసుకోదు ఎలాగైనా తనకు సహాయం చేయాలని కళ్యాణ్ భావిస్తాడు. మరోవైపు శృతి పంపించే డబ్బు కోసం కావ్య ఎదురుచూస్తుంది. ఎలాగైనా ఈ డబ్బు అమ్మ వాళ్లకు పంపించిన వారికి సహాయం చేయాలి అని ఎదురు చూస్తుండగా అంతలోపు శృతి ఫోన్ చేసి అకౌంటెంట్ రెండు రోజులు లీవ్ డబ్బులు ఇప్పుడే పంపించలేను అని చెప్పడంతో కావ్య బాధపడుతుంది.మరోవైపు అన్నపూర్ణ ఆరోగ్యం బాగా లేకపోవడంతో తనకి ఎలాగైనా ట్రీట్మెంట్ ఇప్పించాలని కనుకం మాట్లాడుతుంది.

అయితే వీరి కష్టాలను చూసి చలించి పోయిన అన్నపూర్ణ ఇంటిలో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు అందరూ భోజనం చేస్తూ ఉండగా స్వప్న కొద్దిగా భోజనం చేసి వదిలి వెళ్ళిపోతుంది అలా లేచి వెళ్లిపోవడంతో బయట అన్నం లేక ఎంతో మంది బాధపడుతున్నారు ఇలా అన్నం వేస్ట్ చేయకూడదని కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో మాట అంటారు. అయినా కడుపుతో ఉన్న దానివి ఇలాంటి ఫుడ్ తినడం ఎంతో అవసరమని చెబుతారు.

అయితే అంతలోపు రాహుల్ తనకు సలాడ్ తీసుకురావడంతో కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటివి తినొచ్చా అని చిట్టి స్వప్న పై సీరియస్ అవుతుంది. మరోవైపు ఫ్రీ లాన్సర్ గీసిన డిజైన్స్ అన్నింటిని రాజ్ కావ్యకు చూపిస్తారు. అలాగే తాను ఒక గొప్ప కళాకారిని ఎంతో అద్భుతంగా డిజైన్స్ గీసింది అంటూ తన పై ప్రశంసలు కురిపిస్తారు.నువ్వు ఉన్నావ్ ఎప్పుడు చూసినా చుక్కల ముగ్గులు వేస్తూ ఉంటావని వెటకారంగా మాట్లాడతారు.

ఆ అమ్మాయిని పొగడటం కోసం నన్ను తిట్టడం అవసరమా అంటూ కావ్య అనడంతో ఆ అమ్మాయికి చాలా టాలెంట్ ఉంది తనని ఎక్కడికో తీసుకెళ్తానని రాజ్ తనని పొగుడుతూ ఉండగా తనకు పని ఉందని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిపోవడంతో చార్జర్ కోసం రాజ్ కబోర్డ్ తెరుస్తారు. అయితే అందులో డిజైన్స్ ఉండడం చూసే షాక్ అవుతారు.

అలాగే ఆ డిజైన్స్ అన్ని కూడా ప్రిలాన్సర్ డిజైనర్ గీసిన వాటిలాగే ఉండడం చూసి షాక్ అవుతాడు దీంతో వెంటనే శృతికి ఫోన్ చేసి నీ దగ్గర పని చేస్తున్న ఆ ప్రీలాన్సర్ డిజైనర్ పేరు ఏంటి అని అడుగుతారు. ఇంతటితో ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి అవుతుంది. తర్వాత భాగంలో స్వప్న స్కిప్పింగ్ చేస్తుండడం చూసి షాక్ అయిన చిట్టి అసలు ఇది కడుపుతో ఉందా అని సందేహాలు వ్యక్తం చేస్తారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus