Chor Bazaar Movie: ‘చోర్ బజార్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చోర్ బజార్’. ‘దళం’ ‘జార్జ్ రెడ్డి’ వంటి చిత్రాలను అందించిన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ‘యూవీ క్రియేషన్స్’ సమర్పణలో ‘ఐవీ క్రియేషన్స్’ పతాకంపై వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. పైగా ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ స్పీచ్ ఈ చిత్రం పై జనాల ఫోకస్ పడేలా చేసింది.

జూన్ 24 న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఒకసారి ‘చోర్ బజార్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :

నైజాం 1.80 cr
సీడెడ్ 0.78 cr
ఉత్తరాంధ్ర 0.90 cr
ఈస్ట్ 3.48 cr
వెస్ట్ 0.28 cr
గుంటూరు 3.76 cr

‘చోర్ బజార్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.3.76 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆకాష్ పూరి గత చిత్రం ‘రొమాంటిక్’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.4 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది.

మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘చోర్ బజార్’ ఆ స్థాయిలో కలెక్ట్ చేస్తుందా అన్నది అనుమానమే. ఈ చిత్రానికి పోటీగా ‘సమ్మతమే’ తో పాటు గత వారం విడుదలైన సినిమాలు ఉన్నాయి. చూడాలి ఏ మేర ఈ మూవీ కలెక్ట్ చేస్తుందో..!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus