సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. వైజాగ్ నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఆయన సడన్ గా అనారోగ్యం పాలయ్యారట. దీంతో హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్టు సమాచారం. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు కోరుకుంటూ సాంతం వ్యక్తం చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్.రామారావు. ఈయన తిరుపతిలో జన్మించారు. సినిమాల్లోకి వచ్చాక ఈయన రాకేష్ మాస్టర్ గా పేరు మార్చుకున్నారని తెలుస్తుంది.టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్స్ గా పనిచేస్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వంటి వారు రాకేష్ మాస్టర్ శిష్యులే అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి నటీనటులు కూడా రాకేష్ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య వంటి హిట్ సినిమాలకి ఈయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో సెలబ్రిటీల పై అసభ్యకర కామెంట్లు, వివాదాస్పద ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన వార్తల్లో నిలిచారు. సునిషిత్ వంటి చెత్త వాగుడు వాగుతూ ఫేమస్ అవ్వాలనుకునే బ్యాచ్ ను ఈయన ఇంటర్వ్యూ చేసి వాళ్ళను మూడు చెరువుల నీళ్లు తాగించారు రాకేష్ మాస్టర్. అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది.