‘పెదకాపు పార్ట్ 1’ ట్రైలర్ చూశారా? చాలా ఇంట్రెస్టింగ్, సరికొత్తగా విజువల్ ఫీస్ట్‌లా సిద్ధం చేశారు. ఈ సినిమాను కెమెరాలో బంధించింది తెలుగు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు. మామూలుగా అయితే ఇలాంటి సినిమాలకు ఇతర రాష్ట్రాల కెమెరామెన్‌లను ఎంచుకుంటారు. అయితే సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఛోటా కె నాయుడునే కావాలి అన్నారట. సినిమా విడుదల క్రమంలో సినిమాటోగ్రాఫర్ మీడియాలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాలో గోదావరిని ఇలా చూపించాలి అని కొన్ని కలలు కన్నానని, అయితే ‘కొత్త బంగారులోకం’లో కొద్దివరకే చేసి చూపించాను అని నాటి రోజుల గుర్తు చేసుకున్న ఛోటా కె.నాయుడు.. ‘పెదకాపు 1’లో పూర్తిస్థాయిలో చూపించే అవకాశం దొరికిందని చెప్పారు. అలాగే ట్రైలర్‌లో ఎండిపోయిన చెట్టుకు ఓ మృతదేహం వేలాడుతూ కనిపించే సన్నివేశం వెనుక ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి అని అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక అసలు విషయం చెబుతా అన్నారు.
సినిమాలో ఆ చెట్టు సన్నివేశం కీలకమని, బురదగా ఉన్న ఓ పొలంలో ఎండిపోయిన చెట్టుని నాటి ఆ సన్నివేశాన్ని తీయాల్సి వచ్చింది. ఎంత కష్టం అయినా ఆ పని చేసి, సన్నివేశం తీశాం అని చెప్పారు. బురదలోకి క్రేన్‌లు వెళ్లలేవని, మనుషులు మోసుకొని వెళ్లి నాటలేరు అని.. అలాంటి పరిస్థితుల్లో తామేం చేశామో… సినిమా ఈ నెల 29న విడులయ్యాక చెబుతాను అని తెలిపారు. కథ రీత్యా 80వ దశకం నాటి వాతావరణాన్ని చూపించామని తెలిపారు.
ఈ క్రమంలో సినిమాటోగ్రాఫర్ల విషయంలో టాలీవుడ్ ఆలోచనలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి కథని ఇస్తే, హైదరాబాద్‌లో ఉన్న ఏ సినిమాటోగ్రాఫర్ అయినా బాగా తీస్తారు. ఇలాంటి కథ అనుకోగానే, పొరుగు భాషల్లో ఎవరెవరు ఇలాంటి సినిమాలకి పనిచేశారో వెతుకుతారు. ఓటీటీల్లో సినిమాలు చూసి.. అలాంటి సీన్స్ కావాలని వాళ్లనే ఎంచుకుంటారు. అలా కాకుండా లోకల్ వాళ్లకు ఇస్తే చేసి చూపిస్తారు అని చెప్పారు.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!