‘జై లవ కుశ’ టీమ్లోకి అడుగుపెట్టిన ప్రముఖ టెక్నీషియన్!
- May 15, 2017 / 02:18 PM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని బూతు బంగ్లాలో వేసిన భారీ సెట్ లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీమ్లో ఈరోజు భారీ మార్పు జరిగింది. ఈ సినిమాకి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సీకే మురళీధరన్ పనిచేశారు. ఆయన గత రెండు షెడ్యూల్స్ ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు కూడా పూర్తి డెడికేషన్ తో పనిచేస్తున్నారు.
అయితే ఆయన ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారం వేరే ప్రాజక్ట్ కి పనిచేయాల్సి వచ్చింది. దాంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. మురళీధరన్ స్థానంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడును తీసుకున్నారు. ఎన్టీఆర్ స్పీడ్ కి తగ్గట్టు పనిచేయగల చోటా జై లవకుశ టీమ్లోకి రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. తొలిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈనెల 19 వ తేదీ సాయంత్రం రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















