Jr NTR: తారక్ అప్పట్లోనే అలా చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతిభ గల నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటన గురించి సినీ ప్రముఖులు పలు సందర్భాల్లో మాట్లాడుతూ తాతకు తగ్గ మనవడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయశ్రీ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుబ్బు సినిమా కొరకు ఎన్టీఆర్ పడిన కష్టం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఏ సీన్ అయినా ఎన్టీఆర్ చేయగలడా అనే అనుమానం సెట్ లో ఎవరికీ ఉండేది కాదని చిన్న వయస్సులోనే అనుభవం ఉన్న నటుడిలా ఎన్టీఆర్ నటించేవారని ఆమె అన్నారు.

యాక్షన్ సీన్లలో ఎన్టీఆర్ ను చూసి ఆశ్చర్యపోయామని ఆమె పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్ బాగా నటించేవారని సినిమాసినిమాకు డ్యాన్స్, యాక్షన్ విషయంలో పరిణతి సాధిస్తున్నారని విజయశ్రీ వెల్లడించారు. సుబ్బు యాక్షన్ సినిమా అని కసితో సీన్లలో ఎన్టీఆర్ నటిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. సింగిల్ టేక్ లో సీన్లను పూర్తి చేస్తారని ఒక ఆర్టిస్ట్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఎన్టీఆర్ లో ఉన్నాయని విజయశ్రీ వెల్లడించారు. కెరీర్ తొలినాళ్లలోనే నటనతో ఎన్టీఆర్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేయడం గమనార్హం.

ప్రస్తుతం ఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తుండగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ఆగష్టు 15వ తేదీన ప్రారంభం కానుంది. చరణ్ గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ తొలి ఎపిసోడ్ గా ప్రసారం కానుందని తెలుస్తోంది.


‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus