Allu Arjun, Chiranjeevi: అల్లు అర్జున్ అమెరికాకు అందుకే వెళ్లాడట.. క్లారిటీ ఇదే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో రోజురోజుకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. బన్నీ నటించబోతున్న పుష్ప ది రూల్ షూటింగ్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని పుష్ప ది రైజ్ ను మించేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. అయితే తాజాగా బన్నీ అమెరికాకు వెళ్లారు. మెగాస్టార్ బర్త్ డే స్కిప్ చేయడానే బన్నీ అమెరికాకు వెళ్లారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ విషయంలో కొంతమంది అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి బన్నీ పీఆర్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. న్యూయార్క్ లో ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ నుంచి బన్నీకి ఆహ్వానం అందిందని ఈ ఆహ్వానం వల్లే బన్నీ అందులో పాల్గొనడానికి వెళుతున్నాడని బన్నీ పీఆర్ టీమ్ వెల్లడించడం గమనార్హం.

న్యూయార్క్‌లోని మాన్ హట్టన్ ప్రాంతంలో భారత్ 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుగుతోంది. ఈ కారణం వల్లే బన్నీ అక్కడికి వెళుతున్నారు తప్ప చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరు కాకూడదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ట్రోల్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో బన్నీ చిరంజీవి పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా పుష్ప ది రూల్ షూటింగ్ జరగనుంది. సమ్మర్ లో విడుదలైన బన్నీ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బన్నీ సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. బన్నీ రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని బోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus