Mokshagna, Sreeleela: మోక్షజ్ఞ శ్రీలీల పెళ్లి వార్తలపై క్లారిటీ ఇదే.. ఏం జరిగిందంటే?

మోక్షజ్ఞ శ్రీలీల కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో కొంతమంది ఏకంగా మోక్షజ్ఞతో శ్రీలీల పెళ్లి అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ ప్రచారం మరింత ఎక్కువ కావడంతో శ్రీలీల టీం స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇలాంటి బాధ్యతారహిత జర్నలిజాన్ని చూసి శ్రీలీల ఆశ్చర్యపోయిందని చెబుతూ వైరల్ అవుతున్న వార్తలకు శ్రీలీల టీం చెక్ పెట్టడం గమనార్హం. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టాయి.

ఈ ప్రచారం విషయంలో సైలెంట్ గా ఉంటే నష్టమని భావించిన శ్రీలీల వెంటనే స్పందించి చెక్ పెట్టేశారు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగానే మోక్షజ్ఞ సెట్స్ కు, ప్రమోషన్స్ కు హాజరు కావడంతో ఒకే ఫ్రేమ్ లో మోక్షజ్ఞ, శ్రీలీల కనిపించడం జరిగింది. అంతకు మించి వీళ్లిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. శ్రీలీల స్పందన నేపథ్యంలో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

మోక్షజ్ఞ (Mokshagna) సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడం వల్ల మోక్షజ్ఞ కెరీర్ కు నష్టమే తప్ప లాభం ఉండదు. భగవంత్ కేసరి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు కాగా బాలయ్య దసరా పండుగకు ప్రేక్షకులకు తన సినిమాతో మరింత సంతోషాన్ని నింపనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీలీల స్థాయిని పెంచే సినిమా ఈ సినిమా అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాత్యాయని రోల్ తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందని కాజల్ అగర్వాల్ ఫీలవుతున్నారు. బాలయ్య తర్వాత సినిమాలు బాబీ, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. అఖండ సీక్వెల్ తో బాలయ్య, బోయపాటి శ్రీను ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అఖండ సీక్వెల్ కు నిర్మాత ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. బోయపాటి శ్రీను సినిమాలు అన్నీ భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus