Salaar: ప్రభాస్ ‘సలార్’పై లేటెస్ట్ అప్డేట్!

ఈ మధ్యకాలంలో ఒక కథను రెండు భాగాలుగా సినిమా తీయడం చూస్తూనే ఉన్నాం. ‘బాహుబలి’ సినిమాతో ఈ ట్రెండ్ మొదలైంది. ఆ తరువాత చాలా సినిమాలను రెండు భాగాలుగా తీయడం మొదలుపెట్టారు. కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలుగా సినిమా తీయడం కంపల్సరీ అని అంటున్నారు మేకర్స్. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సలార్’ కూడా ఇలానే రెండు పార్ట్స్ గా వస్తుందని అన్నారు.

అధికారికంగా ఈ విషయం ప్రకటించినప్పటికీ.. స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ దీనిపై లీకులిచ్చారు. రెండు భాగాలుగా సినిమా రావొచ్చేమో అన్నట్లుగా మాట్లాడారాయన. దీంతో ‘సలార్’ పార్ట్ 1 ఈ ఏడాదిలో వస్తుందని.. ఆ తరువాత పార్ట్ 2 వస్తుందని ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే.. ఇప్పుడు ‘సలార్’ సినిమా సింగిల్ సినిమాగానే రాబోతుందని తాజా సమాచారం. కథ డిమాండ్ చేయకపోవడం వలన రెండు భాగాలుగా తీయడం లేదా..? లేక బడ్జెట్ ఇష్యూస్ వలన..? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఈ సినిమాకి అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగిపోయింది. ప్రభాస్ ఒక్కడికే వంద కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి రెండు భాగాలుగా సినిమా తీస్తేనే వర్కవుట్ అవుతుందని అప్పట్లో మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడేమో ఒక భాగమే అంటున్నారు. ఎందుకంటే.. ఈసారి టైం లేదట. ‘సలార్’ సినిమా పూర్తి చేసి ఆ తరువాత ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టాలి ప్రశాంత్ నీల్.

ఇక ప్రభాస్ అయితే వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఆయన్ను నమ్ముకొని దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు. దీంతో ‘సలార్’ సినిమాను సింగిల్ సినిమాగానే తీయాలనుకుంటున్నారు. బహుశా.. టైం ఉంటే రెండు భాగాలుగా సినిమా తీసేవారేమో కానీ ఇప్పుడైతే రెండు పార్ట్స్ కష్టమని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో కొందరు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus