ఏప్రిల్ నెలలో వకీల్ సాబ్ సినిమా రిలీజైన సమయంలో జగన్ సర్కార్ టికెట్ ధరల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఏపీలో టికెట్ రేట్లు భారీగా తగ్గగా ఆ ధరలతో థియేటర్లు రన్ చేయలేమని థియేటర్ల యజమానులు వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరించిందని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా టికెట్ రేట్లకు సంబంధించి కొత్త జీవో అమలులోకి వచ్చింది.
త్వరలో ఏపీలో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ జీవోను అమలులోకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవడం కానీ తగ్గించడం కానీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. సినిమా స్థాయిని బట్టి ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రభావం పవన్ సినిమాలపై పడనుందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో పవన్ సినిమాలు రిలీజైన సమయంలో జగన్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.
వకీల్ సాబ్ సినిమాకు వ్యవహరించనట్లుగా ప్రభుత్వం పవన్ తరువాత సినిమాలకు కూడా వ్యవహరిస్తే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇష్టానుసారం టికెట్ రేట్లను పెంచుకునే వీలు లేకుండా చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు ఒక రకంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.