ఎవడి గోల వాడిది అన్న పదం విన్నాం కదా. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కధ ఈ పదంతో ముడిపడి ఉంది. విషయం ఏమిటంటే ‘పందెం కోడి’ హీరో విశాల్ గుర్తున్నాడా?ఎందుకు ఉండడు…ఉండే ఉంటాడులే, రోజుకో హీరోయిన్ తో ఎఫయిర్ అంటూ తమిళ మీడియా ప్రతీ రోజు ఆయన్ని చూపిస్తూనే ఉంటుంది. అయితే ఆయనకు, ప్రఖ్యాత దర్శకుడు లింగు స్వామికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అని తమిళ మీడియా కోడై కూస్తుంది. దర్శకుడు లింగు స్వామి విశాల్ తో ‘పందెం కోడి 2’ తీస్తానని కమిట్ అవ్వగా అసలే ఫ్లాప్స్ లో ఉన్న విశాల్, లింగు స్వామి కోసం ఎదురు చూస్తున్నాడు.
కానీ ఈ దర్శకుడు మాత్రం విశాల్ కు కధ చెప్పకుండా కాలం గడిపేస్తూ ఉండడంతో కోపంతో ఊగిపోయిన మన హీరోగారు పబ్లిక్ ప్లాట్‌ఫారంపై లింగుస్వామి అన్‌ప్రొఫెషనల్ ఆటిట్యూడ్‌ని దుయ్యబట్టాడు. పందెంకోడి 2 కాన్సిల్ అయిందని ప్రకటించాడు. అయితే ఇక లింగు స్వామి విషయానికి వస్తే సికింధర్ ఫ్లాప్ తో డీలా పడ్డ లింగు స్వామి, బన్నీతో సినిమా తీయాలి అన్న ఆలోచనతో ఎదురు చూస్తూ ఉండగా, బన్నీ సైతం అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.
ఫ్లాప్స్ లో హీరో విశాల్ మిగతా సినిమాలన్నీ కాన్సిల్ చేసుకుని మరీ ఈ దర్శకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఈ దర్శకుడు మాత్రం బన్నీ మాట కోసం ఎదురు చూస్తున్నాడు. హీరో బాధ హీరో గారిది, దర్శకుడి బాధ దర్శకుడిది అందుకే చెప్పింది ఎవడి గోల వాడిది అన్న పధం గుర్తు పెట్టుకోమని.