నెంబర్ ఒన్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం మరీ ఇన్ని తిప్పలు పడాలా!

ఇదివరకు ఒక సినిమా హిట్ అని జనాలకు తెలియాలంటే ఆడియన్స్ రియాక్షన్స్ లేదా సినిమాలోని హైలైట్ సీన్స్ ను ప్రోమోలుగా కట్ చేసి టీవీల్లో యాడ్స్ రూపంలో వేసేవారు. ఈటీవీ, జెమిని టీవీలో వచ్చే ఆ యాడ్స్ బట్టే జనాలు థియేటర్లకు కూడా వెళ్ళేవాళ్లు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రమోషన్స్ మొదలయ్యాయి. సినిమాల మీద మీమ్స్ తో కూడా పబ్లిసిటీ మొదలెట్టారు. అయితే.. ఇప్పుడు సినిమాల పబ్లిసిటీ విడుదలకు ముందు కంటే.. సినిమా విడుదలయ్యాక తమ సినిమా హిట్ అని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎక్కువగా పరితపిస్తున్నారు మన నిర్మాతలు. బాలేని సినిమాలకు ఎంత హడావుడి చేసినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కానీ.. బాగున్న సినిమాలకు కూడా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇంత షేర్ వచ్చింది అని నిర్మాతలు చేస్తున్న హడావుడి మరీ ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్ ను తలపిస్తుంది.

“సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” చిత్రాలు రెండిటికీ పాజిటివ్ బజ్, పాజిటివ్ రివ్యూలు, జనాల నుండి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. రెండు సినిమాలను సూపర్ హిట్స్ గా ట్రేడ్ వర్గాలు కూడా డిక్లేర్ చేసేశాయి. బాక్సాఫీస్ కళకళలాడుతోంది, థియేటర్లో ప్రేక్షకుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ.. నిర్మాతలు మాత్రం మా సినిమా పెద్ద హిట్ అంటే మా సినిమా పెద్ద హిట్ అంటూ పోస్టర్లతో కొట్టుకుంటున్నారు. ఒకరు మా సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది అంటే సరిగ్గా గంటలో మా సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసింది అని పోస్టర్లు వదులుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. హిట్ సినిమా నిర్మాతలు ఇలా కొట్లాడుకుంటుండడం.. సదరు చిత్ర కథానాయకుడి అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు. మరి ఈ విషయంలో నిర్మాతలు కాస్త త్వరగా రియలైజ్ అయ్యి ఈ గొడవలు ఆపేస్తే బెటర్!

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus