RRR Collections: ‘ఆర్ఆర్ఆర్’కి రివ్యూ ఇచ్చేసిన కలరిస్ట్!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన లేటెస్ట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. నిజానికి ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చి 25న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. పలు టీవీ ఛానెల్స్ కి, యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ ను తెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

Click Here To Watch Now

అలానే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకి కలరిస్ట్ గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ అయితే మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. రీసెంట్ గా ఆయన సినిమా చూశారట. తన అనుభవాన్ని వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ”ఇప్పుడే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాను. కలరిస్ట్ గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యి సార్లు చూసినా..

సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎవరూ బ్రేక్ చేయలేని కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని.. మూడు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్పారాయన. మార్చి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రీమియర్లు మార్చి 24న అమెరికాలో పడనున్నాయి. ఆల్రెడీ 1500 లొకేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అక్కడ ఆల్రెడీ రెండు మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసి.. మూడు మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతుంది.

ఇండియాలో ఈ నెల 24న పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు మూడు వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాని రూ.550 కోట్ల బడ్జెట్ లో నిర్మించారని సమాచారం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus