Chinmayi Sripada: సోషల్ మీడియాలో తన భర్తపై సానుభూతి చూపేవాళ్లకి చిన్మయి చురకలు!

సోషల్ మీడియాలో తాను చేసే ప్రతీ ట్వీట్ కి ట్రోల్ అయ్యే ఏకైక వ్యక్తి చిన్మయి (Chinmayi Sripada) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే.. ఆమె మంచి చెప్పినా, చెడు చెప్పినా జనాలు ఆమె చెప్పేది ఏంటి అనే విషయాన్ని పట్టించుకోకుండా పిచ్చిపిచ్చిగా తిడుతుంటారు. అయితే.. చిన్మయి ఆ విషయాల్ని ఎప్పడు సీరియస్ గా తీసుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది అనుకోండి. అయితే.. చాలాకాలం తర్వాత ఇటీవల “ఫిల్మ్ ఫోకస్”కి వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన చిన్మయి తన కెరీర్ & పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలు చెప్పుకొచ్చింది.

Chinmayi Sripada

దాదాపుగా రెండు గంటల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో ఆమె చాలా విషయాలు చర్చించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతన్న అన్యాయాలు మొదలుకొని, ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి ఎన్నో అంశాలను చెప్పింది. అయితే.. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో తనపై కోపం చూపుతూ, తన భర్త రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) పై జాలిపడే వాళ్లపై కూడా రెస్పాండ్ అయ్యింది చిన్మయి.

“రాహుల్ నన్ను పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందిపడుతున్నాడని తెగ బాధపడిపోతూ ఉంటారు సోషల్ మీడియాలో జనాలు. రండయ్యా వచ్చి రాహుల్ ని కాపాడండి, నేనేమైనా వద్దు అన్నానా, వచ్చి నా పిల్లల డైపర్లు మార్చండి, ఇంట్లో పనులు చేయండి” చమత్కరించింది చిన్మయి.

అలాగే.. తమిళంలో తన బ్యాన్ గురించి మాట్లాడుతూ రాధారవి (Radha Ravi) , వైరముత్తుపై మరోసారి నిప్పులు చెరిగింది. అదే క్రమంలో.. తనకు వర్క్ ఇచ్చిన కారణంగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తదితర దర్శకులు ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది చిన్మయి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్న ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను మీరూ ఓ లుక్కేయండి..

కంగువ సినిమాలో నటించడానికి మొదట కాస్త ఆలోచించాను: సూర్య!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus