Ali, Mohan Babu: మోహన్ బాబుకి జరిగిన ఘోరమైన అవమానం గురించి తెలిపిన అలీ..!

సినీ పరిశ్రమలో ఎదగడం అంటే చిన్న విషయం కాదు.ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆత్మగౌరవాన్ని చంపుకోవాలి.. ఎన్నో రోజులు పస్తులు ఉండాలి. అయినా సినిమా అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఇక్కడ ఎదిగేవాళ్ళు అన్ని రకాలుగా నలిగిపోయినవాళ్ళే. డైలాగ్ కింగ్ మోహన్ బాబు మరింత ఘోరమైన అవమానాలను ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చారని ఇటీవల ఓ షోలో పాల్గొన్న అలీ చెప్పుకొచ్చాడు. అంతేకాకూండా ఆయనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని కూడా వివరించి కంటతడి పెట్టించారు అలీ.

నిజంగా అలీ కామెంట్స్ చాలా ఎమోషనల్ గా అలాగే మోహన్ బాబు గారి పై మరింత గౌరవం పెంచేలా ఉన్నాయనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘డ్రామా జూనియర్స్’ అనే షోకి అలీ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.వచ్చే ఆదివారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ఓ ప్రోమోని వదిలారు. ఈ ఎపిసోడ్ కు మంచు లక్ష్మీ కూడా అతిథిగా విచ్చేసారు. ఇక షోలో భాగంగా జరిగిన ఓ స్కిట్ లో.. ఆర్టిస్ట్ లకి, స్టేజ్ ఆర్టిస్ట్‌లకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు. కరోనా కష్టకాలంలో స్టేజి ఆర్టిస్ట్ లకు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని వివరించారు.

ఈ నేపథ్యంలో అలీ.. మోహన్ బాబుకి జరిగిన ఘోర అవమానం గురించి వివరించారు. ‘లక్ష్మీ తండ్రి, మంచు భక్తవత్సలం గారు ఆయన పేరు..! ఆయన మూడు, నాలుగు నెలలుగా ఇంటి రెంట్ కట్టడం లేదు, ఖాళీ చేయడం లేదు.. అని భావించి ఆ ఇంటి ఓనర్.. తినే ప్లేట్‌లో మలానికి వెళ్ళాడు.ప్రతీ యాక్టర్ అంత ఈజీ కాదు ఎదగడం. దాని వెనుక ఎంతో బాధ ఉంటుంది, కృషి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus