Comedian: బిగ్ బాస్ 5లో కమెడియన్ అలీ.. కానీ?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 ఈ ఏడాది కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5కు నాగార్జున లేదా రానా హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. బిగ్ బాస్ షోపై నెటిజన్ల నుంచి చాలా సందర్భాల్లో విమర్శలు వినిపించినా ఈ షో ఇతర షోలతో పోలిస్తే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుండటంతో ఈ షోకు ప్రేక్షకాదరణ అంతకంతకూ పెరుగుతోంది.

కరోనా ఫస్ట్ వేవ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 4 ఆలస్యంగా ప్రారంభం కాగా కరోనా సెకండ్ వేవ్ వల్ల బిగ్ బాస్ సీజన్ 5 సైతం ఆలస్యంగా ప్రారంభమవుతూ ఉండటం గమనార్హం. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్లను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5లో కమెడియన్ అలీ కూడా పాల్గొంటారని సమాచారం. కంటెస్టెంట్ గా కాకుండా స్పెషల్ ప్రోగ్రామ్ చేయించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు అతనిని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 5లో స్పెషల్ ప్రోగ్రామ్ కు అలీ యస్ చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 5లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్లే ఎక్కువగా ఉండబోతున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో యూట్యూబ్ స్టార్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చిన నిర్వాహకులు సీజన్ 5కు సంబంధించి మాత్రం సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకే ఎక్కువగా ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్4 రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ లు సాధించగా సీజన్ 4ను మించి సీజన్ 5 సక్సెస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video



విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus